బాలకృష్ణ కాళ్లకు మొక్కిన ఐశ్వర్యారాయ్

ఐఫా అవార్డుల వేడుక అబుదాబిలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం మొత్తానికి హైలైట్ ఏమిటంటే.. తెలుగులో సీనియర్ హీరోలుగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్. వీరిని ఒకే ఫ్రేమ్ లో వీరిని చూసినవారంతా సంతోషానికి గురయ్యారు. ఈ వేడుకకు తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం పరిశ్రమల నుంచి స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు, స్టార్ టెక్నీషియన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన ఘట్టం ఆవిష్కృతమైంది. అదేమిటంటే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ నందమూరి బాలకృష్ణ కాళ్లకు నమస్కరించడం.

తమిళం నుంచి ఉత్తమ నటిగా ఐశ్వర్యారాయ్
తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాకు ఐశ్వర్యారాయ్ కు తమిళంలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు దక్కింది. ఈ అవార్డును ఆమెకు బాలయ్య చేతులమీదుగా అందజేశారు. అవార్డు అందుకునేందుకు స్టేజీమీదకు వచ్చిన ఐశ్వర్యారాయ్ నందమూరి బాలకృష్ణ కాళ్లకు నమస్కారం చేశారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరలవుతున్నాయి. ఐఫా అవార్డుల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా అవార్డు, బాలకృష్ణకు గోల్డెన్ లెగసీ అవార్డు ప్రకటించారు.

aishwarya rai takes blessings from nandamuri balakrishna in iifa awards program

ఉమెన్ ఆఫ్ ద ఇయర్ గా సమంత
ఉమెన్ ఆఫ్ ద ఇయర్ గా సమంత, ఔట్ స్టాండింగ్ ఎక్స్ లెన్స్ కన్నడం నుంచి రిషభ్ శెట్టి, ఉత్తమ తెలుగు చిత్రంగా దసరా, ఉత్తమ తమిళ చిత్రంగా జైలర్, ఉత్తమ నటుడిగా తమిళం నుంచి విక్రమ్, ఉత్తమ నటుడిగా తెలుగు నుంచి నాని, ఉత్తమ నటిగా తమిళం నుంచి ఐశ్వర్యారాయ్, ఉత్తమ దర్శకుడిగా తమిళం నుంచి మణిరత్నం, తెలుగు నుంచి ఉత్తమ విలన్ గా షైన్ టామ్ దసరా సినిమాకు, కన్నడం నుంచి ఉత్తమ విలన్ గా జగపతిబాబు, ఉత్తమ సహాయ నటుడిగా తమిళం నుంచి జయరామ్ పొన్నియన్ సెల్వన్ 2 చిత్రానికి, మళయాళం నుంచి ఉత్తమ విలన్ గా అర్జున్ రాధాకృష్ణన్, తమిళం నుంచి ఉత్తమ సంగీత దర్శకుడిగా రెహమాన్ అవార్డులు అందుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+