బాలయ్య ఫ్యాన్స్ గెట్ రెడీ.. "అఖండ 2" క్రేజీ అప్డేట్ వచ్చేస్తోంది..!
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా "డాకు మహారాజ్" చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నారు. అంతకుముందు చేసిన "వీరసింహారెడ్డి, "భగవంత్ కేసరి", "అఖండ" చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఇక ప్రస్తుతం బాలయ్య "అఖండ-2" చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే మేకర్స్ ఈ మూవీ నుంచి ఓ సర్ ప్రైజ్ ను ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి కానుకగా "అఖండ 2" నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోనే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
బాలయ్య, బోయపాటి కాంబో అంటేనే బ్లాక్ బస్టర్ అని ఇప్పటికే వచ్చిన మూడు సినిమాలతో నిరూపించారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'సింహా', 'లెజెండ్', 'అఖండ' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ప్రస్తుతం వీరి కలయికలో వస్తున్న నాలుగో చిత్రం 'అఖండ-2' కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ పార్ట్ 1 మాదిరిగానే ఈ మూవీలోనూ బాలయ్య రెండు విభిన్న గెటప్స్ లో సందడి చేయనున్నారట. ఒకటి అఘోరా పాత్ర కాగా.. మరోపాత్రపై సందిగ్ధత నెలకొంది. ఇక ఈ మూవీలో ప్రగ్యా జైశ్వాల్, సంయుక్తా మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. 14రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని ఈ చిత్రానికి సమర్పకులుగా ఉన్నారు. ఈ మూవీ దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

హ్యాట్రిక్ హీరో బాలయ్య..
నందమూరి బాలయ్య వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన డాకు మహారాజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. అంతకుముందు రిలీజైన "వీరసింహారెడ్"డి, "భగవంత్ కేసరి", "అఖండ" చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు సాధించారు బాలయ్య. "డాకు మహారాజ్" విజయంతో వరుసగా నాలుగో విజయాన్ని అందుకున్నారు. "అఖండ 2" చిత్రంతో పాటు రజనీకాంత్ "జైలర్-2" లో బాలయ్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications