బాలయ్యా.. మడతెట్టేశావు కదయ్యా: అఖండ 2 విశ్వరూపమే ఇక
Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా మూవీ.. అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకుడు. 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ ఇది. అఘోరీగా నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ప్రదర్శించారీ మూవీలో. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిందీ సినిమా. ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కిస్తోన్నారు బోయపాటి. ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాలో సైతం కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
అసలైన అఘోరీలు, వారి జీవన విధానం, త్రివేణి సంగమం, కుంభమేళకు సంబంధించిన సీన్లను షూట్ చేశారు. అఘోరీలతో కూడిన సినిమా కావడం వల్ల ఆయా సన్నివేశాలను చిత్రీకరించాల్సి వచ్చింది. ఆ తరువాత బోయపాటి హిమాలయాల్లో మకాం వేశారు. అక్కడ రెక్కీ నిర్వహించారు. కథకు అనుగుణంగా అత్యంత సంక్లిష్ట ప్రదేశాల్లో సన్నివేశాలను తెరకెక్కించారు. అసేతు హిమాలయ పర్వతాలను సరికొత్త కోణంలో షూట్ చేశారు బోయపాటి.

ఇప్పటి వరకూ ఎవరూ చిత్రీకరించడానికి సాహసించని ప్రదేశాలను అఖండ 2 సినిమాలో చూడబోతున్నారు అభిమానులు. విజయదశమిని పురస్కరించుకుని అఖండ 2 సినిమా విడుదల తేదీ వెల్లడైంది. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి సినిమా థియేటర్లల్లో సునామీ సృష్టించబోతోందీ బిగ్గెస్ట్ మాస్ ఎంటర్టైనర్ మూవీ. పాన్ ఇండియాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ.. టాలీవుడ్ సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పబోతోంది.
ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వెల్లడించింది. అఘోరీ బాలకృష్ణకు సంబంధించిన ఓ కొత్త స్టిల్ ను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ స్టిల్.. అదరగొడుతోంది. బాలయ్య రౌద్రరూపంలో కనిపించారిందులో. త్రిశూలాన్ని చేతపట్టుకుని శివతాండవం ఆడే స్టిల్ ఇది. సినిమాపై అంచనాలను మరింత పెంచినట్టయింది. హిమాలయాల్లో చిత్రీకరించిన అఘోరీ బాలకృష్ణ ఇంట్రడక్షన్ సహా కొన్ని సీన్లన్నీ కూడా గూస్ బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
#Akhanda2Thaandavam pic.twitter.com/WTI4keQrTr
— 14 Reels Plus (@14ReelsPlus) October 2, 2025
ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్, శరత్ లోహితాశ్వ.. ఇతర కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. సరైనోడు తరువాత బోయపాటి శ్రీనుతో మూవీ చేస్తోన్నారు ఆది పినిశెట్టి. ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తోన్నాడు. 14 రీల్స్ ప్లస్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు. ఎం తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తోన్నారు. ఇదివరకే అఖండ 2 టీజర్ విడుదలైన విషయం తెలిసిందే.
-
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం











Click it and Unblock the Notifications