సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల దూకుడుకు భయపడ్డ ‘అఖండ2’ నిర్మాతలు

సామాజిక మాధ్యమాలైన ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్.. తదితర వాటిల్లో ప్రముఖ కథానాయకుడు బాలయ్య అభిమానుల దూకుడు, వారు చూపిస్తున్న అగ్రెసివ్ నేచర్ చూసి అఖండ2 నిర్మాతలు భయపడ్డారంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాను డిసెంబరు 12వ తేదీనే విడుదల చేయాలని పట్టుబట్టడంతోపాటు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు, కామెంట్లతోపాటు వీడియోలు, రీల్స్.. ఇలా అన్నీ చాలా దూకుడుగా ఉన్నాయి.

ఒకరకంగా వీరి అగ్రెసివ్ నెస్ చూసి నిర్మాతలు వెంటనే 12వ తేదీనే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి క్రిస్మస్ సందర్భంగా 25 లేదంటే 26 తేదీల్లో సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అందరికంటే ఎక్కువగా అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు మాత్రం ఒప్పుకోలేదు.

Akhanda 2 producers fear Balayya fans aggression on social media

అఖండ2పై మొదటి నుంచి విపరీతమైన హైప్ ఉంది. ఆ అంచనాలను అందుకునేటట్లుగా దర్శకుడు బోయపాటి శ్రీను చిత్రాన్ని తీర్చిదిద్దారు. అయితే ఈరోస్ సంస్థతో ఉన్న ఆర్థిక విభేదాలవల్ల, ఆ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో స్టే రావడం, 5వ తేదీన విడుదల కావాల్సిన అఖండ2 విడుదల ఆగిపోవడం జరిగాయి. అయితే ఇదే తరుణంలో బాలయ్య తనకు రావాల్సిన 7 కోట్ల పారితోషికాన్ని వదులుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా నిర్మాతలు రామ్ ఆంచట, గోపీ ఆచంట ఈరోస్ సంస్థకు రూ.28 కోట్ల బకాయి పడ్డారు. వాటిని చెల్లించేందుకే తన పారితోషికాన్ని వదులుకున్నారు. అంతేకాదు.. అభిమానుల మాటలకే ఎక్కువగా విలువిచ్చారు. అదెలా అంటే..

బాలయ్య అభిమానులంతా సినిమాను 12వ తేదీనే విడుదల చేయాలంటూ పట్టుబట్టారు. ఎట్టి పరిస్థితుల్లోను 25, 26 తేదీల్లో వద్దంటూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే చేశారు. ఒకరకంగా వారి పంతమే నెగ్గింది. వారి పట్టుదలకు బాలయ్య కూడా ముచ్చటపడ్డారు. 12వ తేదీన విడుదల చేయడం అసాధ్యం అనిపించినా చకచకా ఏర్పాట్లు కానిచ్చేస్తున్నారు.

11వ తేదీన ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. ఇప్పటి నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు. బాలయ్య కెరీర్ లోనే అత్యంత ఎక్కువగా అంచనాలు తెచ్చుకున్న సినిమాకు ఇలా జరిగిందేమిటని అభిమానులంతా ఆందోళన పడ్డారు. ఎట్టకేలకు ఒక వారం రోజుల తర్వాత వారి కోరిక నెరవేరబోతోంది అనేకన్నా బాలయ్యే నెరవేరుస్తున్నారని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+