Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'అఖండ 2' ట్రైలర్ వచ్చేసింది.. బాలయ్య శివతాండవమే..!

నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగో మూవీ 'అఖండ 2'.. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. దాంతో అఖండ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఎప్పటిలాగే బాలయ్య భారీ డైలాగ్స్, ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ స్ తో ట్రైలర్ ఉత్కంఠభరితంగా ఉంది. ఈ మూవీలో బాలయ్య అఘోరా పాత్రలో నటవిశ్వరూపం చూపించారు.

నందమూరి బాలకృష్ణ అఖండ 2 ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. బాలయ్య నటవిశ్వరూపం ఈ ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. మాంత్రికుడిని ఎదిరించే అఘోరాగా బాలయ్య నటన ఉత్కంఠను రేపుతోంది. 2 నిమిషాల 41 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ తో అద్భుతంగా ఉంది. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లోనే మొత్తం సాగుతున్నట్లు కనిపిస్తుంది.

మహా కుంభమేళా ఈ మూవీలో కీలక పాయింట్ అని తెలుస్తోంది. కథ చుట్టూ ఈ మహా కుంభమేళా చుట్టూనే తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక సినిమాలో విలన్స్ గా విదేశీయులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో బోయపాటి గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తమన్ మ్యూజిక్ మైండ్ బ్లాకింగ్ గా ఉంది. ట్రైలర్ చూసిన నెటిజన్లు థియేటర్లు దద్దరిల్లుతాయని కామెంట్స్ పెడుతున్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.

Akhanda 2 Trailer Drops Balayya s Power-Packed Dialogues and Non-Stop Action Set Screens on Fire

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్, పాటలు.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ట్రైలర్ కూడా అదే రేంజ్ లో ఉంది. దాంతో నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీలో ఆది పినిశెట్టి మాంత్రికుడుగా నటిస్తున్నాడు. ఇక బాలయ్య అఘోర సికందర్ గా అలరించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+