"అఖండ పార్ట్ 3" టైటిల్ లీక్.. ఫ్యాన్స్‌కు పూనకాలే !!
ఎన్టీఆర్ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ నటసింహం బాలయ్య దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు. వరుసగా నాలుగు సినిమాలు హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ 2" చిత్రంలో నటిస్తున్నారు. 'అఖండ' మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. ఈ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకోగా.. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి
ఈ చిత్రం డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్ లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా డిసెంబర్ 4 నుంచే పెయిడ్ ప్రీమియర్లు సైతం ప్రదర్శితం కానున్నాయి. అఖండ 2 ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరగడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కుమ్మరిస్తుందని చిత్రం బృందం ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాతలు "అఖండ 3 కూడా రావొచ్చు" అని పరోక్షంగా హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ విషయాన్ని అఫిషియల్ చేసేలా నందమూరి అభిమానులకు తమన్ గిఫ్ట్ ఇచ్చారు.

తమన్ పోస్ట్ వైరల్..
ఈ మూవీకి ఎస్.ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్న విషయం తెలిసిందే. కాగా లేటస్ట్ గా డైరెక్టర్ బోయపాటి, చిత్ర యూనిట్‌తో కలిసి దిగిన ఒక ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలో వారి వెనుక ఉన్న స్క్రీన్‌పై "JAI AKHANDA" అని పెద్ద అక్షరాల్లో కనిపిస్తోంది. దీంతో అఖండ 2 క్లైమాక్స్ అదే అని.. అఖండ 3 కన్ఫర్మ్ అంటూ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. పార్ట్ 3 గా రాబోయే ఆ సినిమాకి "జై అఖండ" అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు ఆ పోస్టుని ఫుల్ వైరల్ చేస్తున్నారు.
ఇక ఇటీవలే బాలకృష్ణ నందమూరి అభిమానులకు అదిరిపోయే న్యూస్ లీక్ చేశారు. తన కుమారుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఎప్పటినుంచో ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ గుడ్ న్యూస్ వెల్లడించారు. ఆయన కెరీర్ లో టాప్ చిత్రంగా నిలిచిన సైన్స్ ఫిక్షన్ మూవీ "ఆదిత్య 369"కు సీక్వెల్‌గా రానుంది. త్వరలోనే ఆ మూవీకి "ఆదిత్య 999 మ్యాక్స్" పేరుతో సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్టు స్పష్టం చేశారు. దీంతో నందమూరి అభిమానులు డబుల్ బొనాంజా అంటూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.
AUM NAMA SHIVAYA 🔱🔥 !!
— thaman S (@MusicThaman) December 3, 2025
JAI AKHANDA 📈
THE ROAR IS
BIGGER MIGHTIER STRONGER
ALL SET FOR A TRANCE OF SHIVA 🔱🙌🏿💪🏾
Get ready 🔈🔈🔈🔈🔈🔈🔈🔈🔈🔈🔈🙏#Akhanda2Thaandavam 🔥🔫💣🔱 pic.twitter.com/lle8JGXlYP












Click it and Unblock the Notifications