అక్కినేని ఇంట్లో మొదలైన పెళ్లి సందడి.. అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్..?

అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. కింగ్ నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య 2024 డిసెంబర్ లో నటి శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. అక్కినేని అఖిల్ వివాహం ఖరారైనట్లు తెలుస్తోంది. జూన్ 6న ఆయన పెళ్లి జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అక్కినేని నవ యువ సామ్రాట్ అక్కినేని అఖిల్ అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 6న ఆయన వివాహం జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త జూల్ఫీ రవ్ డ్జీ కూతురు జైనబ్ తో అఖిల్ ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. వీళ్ల ఎంగేజ్ మెంట్ గతేడాది నవంబర్ 26న జరిగింది. అప్పటి నుంచి ఈ జంట ఎక్కువగా ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. తాజాగా వీళ్ల వివాహం జూన్ 6న జరగనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అక్కినేని అఖిల్ సిసింద్రీ (1994) చిత్రంతో బాల నటుడిగా అరంగేట్రం చేశాడు. దీనికి అతను ఫిల్మ్‌ఫేర్ ప్రత్యేక అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఇక అఖిల్ (2015) సినిమాతో పూర్తిస్థాయి హీరోగా అరంగేట్రం చేశాడు . హీరోగా తొలి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. ఆ తర్వాత హలో (2017), మిస్టర్ మజ్ను (2019), మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (2021) చిత్రాలతో యూత్ కు దగ్గరయ్యాడు.

Akhil Akkineni s Wedding Date Reportedly Fixed for June 6

గతేడాది ఏజెంట్ చిత్రంతో వచ్చినా ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్ అయింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీకి ఆశించిన కలెక్షన్స్ రాలేదు. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఇక ప్రస్తుతం అఖిల్ లెనిన్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల రిలీజైన టైటిల్ టీజర్ ఊర మాస్ గా ఉంది. ఈ మూవీతో పక్కా హిట్ కొట్టాలని అఖిల్ చూస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+