రామ్ చరణ్, అల్లు అర్జున్ లపై అక్కినేని అఖిల్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్ !!
తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అక్కినేని నాగార్జున వారసుడిగా సిసింద్రీ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు "అఖిల్". కాగా అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, ఏజంట్ సినిమాల్లో నటించినా.. ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ కావడంతో దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ప్రస్తుతం అఖిల్ నటించిన మోస్ట్ అవేటెడ్ చిత్రం 'లెనిన్'. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను దక్కించుకుని సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. జూలై 10వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ గానే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా.. యూట్యూబ్లో ట్రెండింగ్ లో నిలిచింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది.

లెనిన్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా అఖిల్ మాట్లాడుతూ.. రామ్ చరణ్‌తో తనకున్న ప్రత్యేక బంధాన్ని పంచుకుంటూనే.. 'రంగస్థలం' సినిమా ఇంపాక్ట్ గురించి మాట్లాడారు. అలానే రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, చరణ్ అద్భుతమైన నటనను మెచ్చుకున్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ పుష్ప మూవీ గురించి కూడా ఆకాశానికి ఎత్తేశారు. ఇక ఏజెంట్ సినిమా తర్వాత బాత్రూంలో జారి పడ్డానని.. దాంతో ఎడమ చేతి వేళ్ళకు రెండు శస్త్ర చికిత్సలు జరిగాయని తెలిపారు. మొత్తం 48 కుట్లు పడ్డాయి. ఇక 16 నెలల పాటు నేను విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అందుకే ఈ మూడేళ్ల గ్యాప్ వచ్చింది " అంటూ క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు అక్కినేని అఖిల్, జైనాబ్ ల పెళ్లి వేడుక రీసెంట్ గానే ఘనంగా జరిగింది. జూన్ 6వ తేదీన హైదరాబాద్ లోని నాగార్జున నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వేదికగా అంగరంగ వైభవంగా రిసెప్షన్ వేడుక నిర్వహించారు. అత్యంత వైభవంగా జరిగిన ఆ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.












Click it and Unblock the Notifications