నో డౌట్.. నాగ చైతన్యకు పర్ఫెక్ట్ జోడి ఆమె

అక్కినేని హీరో నాగ చైతన్య, తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాళ డిసెంబర్ 4న వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత శోభితా ధూళిపాళతో నాగ చైతన్య రిలేషన్‌ మెయిన్‌టైన్ చేశారు.నాగ చైతన్య- శోభితా కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వడంతో వీరు డేటింగ్‌లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చారు. వీరి పెళ్లి కూడా చాలా సింపుల్‌గానే జరిగింది.

పెళ్లి అనంతరం శోభితా మాట్లాడుతూ ..నాగ చైతన్య భర్తగా రావడం తన అదృష్ణమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభితా సైతం సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటుంది.పెళ్లి తర్వాత ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీగా మారారు.పెళ్లి తర్వాతనే శోభితా ధూళిపాళ గురించి ఎక్కువ చర్చ సాగింది. సమంత కంటే శోభితా ధూళిపాళ ఏం అందంగా లేదనే విమర్శలు వినిపించాయి. అయితే తనపై వచ్చిన విమర్శలను నోటితో కాకుండా తన ప్రవర్తనతో జవాబిచ్చింది శోభితా.

Akkineni Kodalu Sobhita Dhulipala Steals the Show Traditional Look After Marriage Wins Over Fans

బాలీవుడ్‌లో శోభితా చేసిన సినిమాలు, ఫోటోషూట్‌లు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. సమంతతో పోల్చితే శోభితా అక్కినేని కోడలిగా సరిపోదనే అభిప్రాయం మొదట్లో బలంగా వినిపించింది. సమంత అభిమానుల నుంచి శోభితా తీవ్రమైన ట్రోలింగ్‌ను కూడా ఎదుర్కొంది. అయితే, పెళ్లి ఘనంగా జరిగిన తర్వాత శోభితాలో వచ్చిన పరివర్తన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అచ్చమైన తెలుగింటి కోడలిగా తనను తాను మలుచుకుంటున్న విధానం ఆమెపై ఉన్న నెగెటివ్ అభిప్రాయాన్ని క్రమంగా తొలగిస్తోంది. భర్త కోసం వంట చేయడం, ఎయిర్‌పోర్ట్‌లో చైతన్య కోసం వేచి ఉండటం వంటి ఘటనల్లో ఆమెలోని గృహిణి కనిపిస్తోంది. ముఖ్యంగా, బహిరంగ ప్రదేశాల్లో, అక్కినేని ఇంటి ఫంక్షన్లలో శోభితా డ్రెస్సింగ్ స్టైల్ ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. ఎక్కడికి వెళ్లినా చీరకట్టుతో నిండుగా, సాంప్రదాయబద్ధంగా కనిపిస్తోంది.

Akkineni Kodalu Sobhita Dhulipala Steals the Show Traditional Look After Marriage Wins Over Fans

ఇటీవల ఒక షోరూమ్ ఓపెనింగ్‌లో ఎర్ర చీర, మల్లెపూలతో శోభితా ఎంతో అద్భుతంగా కనిపించగా, తాజాగా డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు నిశ్చితార్థ వేడుకలో ఈ జంట సెంటర్‌ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. లేత ఆకుపచ్చ చీరలో శోభితా, ఆలివ్ గ్రీన్ కుర్తాలో చైతన్య చూడముచ్చటగా కనిపించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

దీంతో మెగా, అక్కినేని అభిమానులు శోభితాపై ఉన్న తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. ఆమె అక్కినేని గౌరవాన్ని కాపాడుతుందని, సమంతను సైతం మరిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. అక్కినేని కోడలిగా శోభితా ధూళిపాళ పర్ఫెక్ట్ అని అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ కొత్త గౌరవాన్ని శోభితా ఎంతకాలం నిలబెట్టుకుంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+