అక్కినేని నాగార్జున వదులుకున్న బ్లాక్ బస్టర్స్

అక్కినేని నాగార్జున తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడే కాదు.. స్టూడియో అధినేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి, కన్ స్ట్రక్షన్స్, డిస్ట్రిబ్యూషన్స్, నిర్మాత... ఇలా విభిన్నరకాల వ్యాపారాలను నిర్వహిస్తున్న నైపుణ్యం కలిగిన వ్యక్తి. చదివింది ఇంజనీరింగ్ లో మాస్టర్స్ అయినా వ్యాపారంలో తిరుగులేని విధంగా రాణిస్తున్నారు. శివ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ఒక ట్రెండ్ ను సెట్ చేసి చిరస్థాయిగా చరిత్రలో తనకో పేజీని లిఖించుకున్నారు. హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో తనకు ఎన్నో మంచి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కాల్షీట్లు ఖాళీలేకపోవడంవల్ల, కొన్ని కథలు నచ్చకపోవడంవల్ల వదులుకోవాల్సి వచ్చింది. అవన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలవడం విశేషం.

దళపతి సూపర్ హిట్ గా నిలిచింది
దళపతిలో రజనీకాంత్ క్యారెక్టర్ చేయాలంటూ మణిరత్నం కోరగా నాగార్జున తిరస్కరించారు. అది సూపర్ హిట్ అయింది. మెకానిక్ అల్లుడు సినిమాలో చిరంజీవి పాత్ర నాగార్జున చేయాల్సివుందికానీ బి.గోపాల్ తో గతంలో తాను చేసిన సినిమాలేవీ సరిగా ఆడకపోవడంతో చేయడానికి తిరస్కరించారు. వీటితోపాటు వెంకటేష్ నటించిన కలిసుందాంరా, మణిరత్నం ఘర్షణ, మౌనరాగం, పూరీ జగన్నాథ్ బద్రి తదితర సినిమాలన్నీ వదులుకున్నారు. పూరీతో తర్వాత సూపర్, శివమణి చేశారు. బద్రి సినిమాను నాగార్జునతో చేయాలని పూరీ ఎంతగానో ప్రయత్నించారుకానీ ఆ కాంబినేషన్ కుదర్లేదు. చివరకు పవన్ కల్యాణ్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సినిమాను అందించారు.

akkineni nagarjuna missed block buster movies

వందో సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని..
ఇవే కాకుండా తన కెరీర్ లో ఇంకా చాలా సినిమాలను నాగార్జున వదులుకున్నారు. ప్రస్తుతం ధనుష్ తో కుబేర, రజనీకాంత్ సినిమా కూలీలో విలన్ గా నటిస్తున్నారు. తన వందో సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని నాగార్జున భావిస్తున్నారు. అందుకు అనేకమంది దర్శకులతో కథాచర్చలు జరుపుతున్నారుకానీ అవేవీ కొలిక్కి రావడంలేదు.. నాగార్జునకు సంతృప్తినివ్వడంలేదు. ఇటీవలే ఆయన తనయులు నాగచైతన్య.. శోభితను పెళ్లాడగా, అఖిల్.. జైనబ్ రవ్జీతో నిశ్చితార్థం జరుపుకున్నారు. నాగార్జున అమలను రెండో వివాహం చేసుకోగా, నాగచైతన్య శోభితను రెండో వివాహం చేసుకున్నారు. అలాగే అఖిల్ కు రెండో పెళ్లి కాకపోయినప్పటికీ రెండో నిశ్చితార్థం కావడం విశేషం. వీరిద్దరూ ప్రేమించుకొని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. దుబాయ్ లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు రవ్జీ తండ్రి. హైదరాబాద్ ఓడియన్ థియేటర్ యజమాని కూడా ఆయనే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+