తన కెరీర్‌లో అక్కినేని నాగార్జున వదులుకున్న ఇండస్ట్రీ హిట్స్
వెండితెరపై మన్మథుడుగా దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని కొనసాగిస్తూ రెండో తరంలో నలుగురు అగ్ర కథానాయకుల్లో ఒకరుగా ఉన్నారు. కొత్త రక్తాన్ని వెండితెరకు పరిచయం చేయడంలో ముందుండేవారు. యువసామ్రాట్ నుంచి కింగ్ వరకు కొనసాగిన ఆయన ప్రస్థానంలో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. తాజాగా తన 100వ సినిమాను అంత్యంత భారీ బడ్జెట్ తో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తన కెరీర్ లో నాగార్జున ఎన్నో సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. వాటిల్లో చాలావరకు అన్నీ సూపర్ హిట్ సినిమాలే ఉన్నాయి.
మణిరత్నం మూడు సినిమాలకు నో
కథ నచ్చక, డేట్లు ఖాళీ లేక, మరికొన్ని ఇతర కారణాలతో తన దగ్గరకు వచ్చిన కథలను తిరస్కరించారు. కొందరు దర్శకులకు నో చెప్పారు. అలా చెప్పినవాటిలో మౌనరాగం, ఘర్షణ, దళపతి, మెకానిక్ అల్లుడు, కలిసుందాం రా, ఆహా, బద్రి, ఆర్జీవీ రామాయణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు తదితర సినిమాలను వదులుకున్నారు. రామ్ గోపాల్ వర్మ 15 సంవత్సరాల క్రితం రామాయణం సినిమా చేద్దామనుకున్నారు. దానికి నాగార్జున ఓకే చెప్పకపోవడంతో ఆయన ప్రాజెక్టు ఆపేశారు. నాగార్జున అయితేనే సినిమా బాగా వస్తుందనేది వర్మ అభిప్రాయం. అలాగే మణిరత్నం దర్శకత్వంలో మౌనరాగం, ఘర్షణ, దళపతి వదులుకున్నప్పటికీ గీతాంజలి లాంటి ఆల్ టైం క్లాసికల్ సినిమా చేశారు.

పాత్రకు ప్రాధాన్యత లేదని..
సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాకు వెంకీకి బదులుగా నాగ్ ను అనుకున్నారు. కానీ నాగ్ అంగీకరించకపోవడంతో వెంకీ, మహేష్ బాబుతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది. దళపతి సినిమాలో అరవింద్ స్వామి పాత్రకు మణిరత్నం అడగ్గా క్యారెక్టర్ చిన్నది కావడంతోపాటు పెద్దగా ప్రాధాన్యత లేదని చేయనన్నారు. పూరీ జగన్నాథ్ బద్రి సినిమాను నాగ్ తో చేయాలని చాలా ప్రయత్నించారుకానీ కుదర్లేదు. చివరకు పవన్ కల్యాణ్ తో తెరకెక్కించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ యింది. తర్వాత శివమణి, సూపర్ సినిమాలు పూరీతో చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే నాగార్జున తన కెరీర్ లో వదులుకున్న సినిమాలు చాలావున్నాయి. అవన్నీ చేసుంటే ఎంతో బాగుండేదని అక్కినేని అభిమానులు నిరుత్సాహపడుతున్నారు.












Click it and Unblock the Notifications