నందమూరి, మెగా ఫ్యామిలీలను కలిపిన ఘనత ఆయనదే..!

ఇప్పుడైతే మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలు కలిసిపోయాయి కానీ, గతంలో ఈ రెండు ఫ్యామిలీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. పైకి బాగానే ఉన్నప్పటికి లోలోపల మాత్రం అధిపత్యపోరు కోసం గట్టిగానే ఈ రెండు ఫ్యామిలీలు పోరాడాయి. ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణ అవకాశం చిక్కినప్పుడల్లా మెగా ఫ్యామిలీ మీద తన అక్కస్సును వెళ్లగక్కేవారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆయనపై బాలకృష్ణ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

రాజకీయాలు అంటే ఎమోషన్ కాదు. అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకాడు. గొప్ప నాయకుడిని ఓడించి పార్లమెంట్‌కి వెళ్ళాడు. అక్కడ ఆటోగ్రాఫ్స్ ఇవ్వడమే సరిపోయింది. చిరంజీవి కూడా అంతే. రాజకీయాల్లో అందరూ రాణించలేరు. మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు...అంటూ చిరంజీవి స్థాయిని తగ్గించి మాట్లాడారు. తన అన్న చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు గట్టిగానే కౌంటరిచ్చారు.

Allu Aravind reconciled Nandamuri and Mega family

బ్లడ్, బ్రీడ్ అనేది జంతువులకు మాత్రమే ఉంటుంది. అమితాబ్, చిరంజీవిని విమర్శించే స్థాయి నీది కాదంటూ బాలకృష్ణపై నాగబాబు అప్పట్లో వరుస వీడియోలు చేశాడు. ఇక ఆ తర్వాత కూడా బాలకృష్ణ మెగా ఫ్యామిలీపై తన విమర్శలను కొనసాగించారు. 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సాయంతో అధికారంలోకి వచ్చింది టీడీపీ. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పవన్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ సెటైర్లు వేశారు. జనసేన సభలకు వెళ్లే వారు అలగాజనం అంటూ బాలకృష్ణ హేళనగా మాట్లాడారు.

Allu Aravind reconciled Nandamuri and Mega family

బాలకృష్ణ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో ఈ రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయి. మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలను కలిపింది మాత్రం అల్లు అరవింద్ అని చెప్పాలి. అల్లు అరవింద్ సమర్పణలోనే బాలకృష్ణ అన్‌ స్టాప్ బుల్ షో చేశారు. ఆ తర్వాతే బాలకృష్ణ మైండ్ సెట్ మారిందని తెలుస్తోంది. ఆ తర్వాత అన్‌ స్టాప్ బుల్ షోకు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ రావడం, రామ్ చరణ్ ఫోన్‌లో మాట్లాడటం, చిరంజీవి త్వరలో షోకు రానుండటం వంటి కార్యక్రమాలతో మెగా ఫ్యామిలీకి బాలకృష్ణ మరింత దగ్గరయ్యారు.

ఇక ఇటీవల జరిగిన ఎన్నికలు ఈ రెండు కుటుంబాలను మరింత దగ్గర చేశాయి.దీని అంతటకి కారణం అల్లు అరవింద్ అనే చర్చ సాగుతుంది. మెగా ఫ్యామిలీకి బాలకృష్ణను దగ్గర చేయడంలో అల్లు అరవింద్ కృషి ఎంతో ఉందని తెలుస్తోంది. అల్లు అరవింద్ పుణ్యామా అంటూ ఇప్పుడు మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలే కాకుండా అభిమానులు కూడా కలిసిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+