పవన్‌ కల్యాణ్‌కు అల్లు కాంపౌండ్ షాక్..సై అంటే సై..?

గత కొద్ది కాలంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ సాగుతున్న సంగతి తెలిసిందే. పైకి అంతా బాగానే కనిపించినప్పటికీ లోలోపల మాత్రం అంతర్యుద్ధం సాగుతోంది. తెలియకుండానే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' సినిమాను మెగా హీరోల ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. ఈ సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తామంటూ మెగా అభిమానులు సవాల్ విసురుతున్నారు. వారికి ధీటుగానే అల్లు అర్జున్ అభిమానులు కౌంటరిచ్చారు. పుష్ప-2 సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పటికీ , మెగా హీరోలెవ్వరూ కూడా స్పందించలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్‌లో కూడా మెగా ఫ్యామిలీ సైలెంట్‌గానే ఉంది.

రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎవరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించలేదు. ప్రస్తుతం వీరి మధ్య వివాదం సద్దుమణిగినట్లు అనిపించినప్పటికీ, అలాంటిది ఏమీ లేదని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన "హరిహర వీరమల్లు" చిత్రం జులై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు విడుదలవుతోంది. చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టింది, ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.

Allu Aravind s film to release in competition with Pawan Kalyan s film

అయితే ఈ సినిమాకు పోటీగా అల్లు అరవింద్ నిర్మించిన మరో సినిమా విడుదల కానుందని తెలుస్తోంది.కన్నడలో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మించిన మహావతార్‌ నరసింహ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేయడం విశేషం. హోంబలే ఫిలింస్ గతంలో కేజీఎఫ్, సలార్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించింది.

Allu Aravind s film to release in competition with Pawan Kalyan s film

హోంబలే ఫిలింస్ నిర్మించిన "మహావతార్‌ నరసింహ" చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల (జూలై) 25న విడుదల చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" చిత్రానికి పోటీగా రాబోతుండటం గమనార్హం, ఎందుకంటే "హరిహర వీరమల్లు" జూలై 24న విడుదల కానుంది. అంటే రెండు భారీ చిత్రాలు ఒక రోజు వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మహావతార్‌ నరసింహ చిత్రాన్ని త్రీడీ వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ యానిమేషన్ చిత్రం కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఈ మూవీ ప్రధానంగా యానిమేషన్‌తో తెరకెక్కింది. విష్ణువు దశావతారాలలో ఒకటైన నరసింహ అవతారం, దాని పురాణ కథ ఆధారంగా ఈ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించారు.

"హరిహర వీరమల్లు" చిత్రానికి పోటీగానే మహావతార్‌ సినిమాను రిలీజ్ చేస్తున్నారని మెగా అభిమానులు ఆరోపిస్తున్నారు. మరి ఈ రెండు భారీ సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని చవి చూస్తాయో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+