పార్టీలో చిల్ అవుతున్న రామ్ చరణ్ - అల్లు అర్జున్.. పిక్ వైరల్ !!
అల్లు వారింట పెళ్లి భాజాలు మోగడానికి సమయం దగ్గర పడుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న తనయుడు, యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల తన పెళ్లికి సంబంధించిన శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. శిరీష్ - నైనికా రెడ్డి రెండేళ్లుగా ప్రేమలో ఉండగా.. చివరకు పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ జంట వివాహం మార్చి 6న జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు షురూ కాగా.. తాజాగా అల్లు అర్జున్ తన నివాసంలో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ పార్టీకి రామ్ చరణ్ దంపతులతో పాటు టాలీవుడ్‌లోని పలువురు సెలబ్రిటీలు హాజరైనట్లు తెలుస్తోంది. ఇటీవలే గోవాలో బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో అల్లు అర్జున్ ఫ్రెండ్స్ సందడి చేయగా తాజాగా కుటుంబసభ్యులు, టాలీవుడ్‌లోని స్నేహితుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ప్రీ-వెడ్డింగ్ పార్టీలో సన్నిహిత బంధువులు, మిత్రులకు మాత్రమే వచ్చినట్టు తెలుస్తుంది. ఆ ఫొటోల్లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు శిరీష్, నయనిక, రామ్ చరణ్, ఉపాసన కొణిదెల అందరూ కలిసి ఫోజులిచ్చారు.

ఇక పార్టీ కోసం అల్లు శిరీష్ నలుపురంగు ఎంబ్రాయిడరీ బ్లేజర్ ధరించగా, నయనిక మెరిసే నలుపు రంగు గౌనులో ఆకర్షణీయంగా కనిపించారు. రామ్ చరణ్, ఉపాసన కామినేని సైతం నలుపు దుస్తులలో ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అల్లు అర్జున్ మెరిసే నలుపు సూట్‌ను ఎంచుకోగా, స్నేహారెడ్డి నలుపు గౌనులో మెరిశారు.
హైదరాబాద్ పార్టీకి కొద్ది రోజుల ముందు, అల్లు శిరీష్ తన తల్లిదండ్రులు అల్లు అరవింద్, నిర్మలతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కొణిదెలలకు తమ పెళ్లికి సంబంధించిన మొదటి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం శిరీష్ ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ, "తెలుగు ఆచారాల ప్రకారం, మా మావయ్య మెగాస్టార్ చిరంజీవి, అత్తయ్య సురేఖలకు పెళ్లి శుభలేఖను అందించాను" అని క్యాప్షన్ ఇచ్చారు.
అల్లు శిరీష్ కెరీర్..
'గౌరవం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో.. ఇప్పటి వరకు గ్రాండ్ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయారు. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోయినా.. కొత్త జంట, ఏబీసీడీ, శ్రీరస్తు శుభమస్తు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిగా 'టెడ్డీ' చిత్రంతో వచ్చిన శిరీష్ మరోసారి ప్రేక్షకులను నిరాశపరిచాడు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్‌లో ఆనంద క్షణాలు -
ఆ హీరోతో నటించాలని ఉంది.. కానీ అలా మాత్రం కాదు !! -
రీసెంట్ టైమ్ లో బెస్ట్ టీజర్.. నవ్వి నవ్వి పొట్ట చెక్కలే..!! -
పెళ్లి కంటే సహజీవనం బెస్ట్: మెగా హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం












Click it and Unblock the Notifications