జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కకు నెట్టేసిన అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడిగా పిలిపించుకునే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. వీరిద్దరూ కలిసి జూనియర్ ఎన్టీఆర్ ను పక్కకు నెట్టేశారు. అసలైన కామెడీ అంటే ఇదే. గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉంది.
అయితే అది ఫ్లాప్ కావడంతో తనకు మూడు సూపర్ హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ ను బన్నీ పక్కన పెట్టేశాడు. దీంతో ఏంచేయాలో పాలుపోని త్రివిక్రమ్ శ్రీనివాస్ మైథలాజికల్, ఫాంటసీ టచ్ ఉన్న సుబ్రమణ్యస్వామి చరిత్రతో కథను తయారు చేసుకున్నారు. దీనికి రూ.500 కోట్ల బడ్జెట్ అవుతుంది. త్రివిక్రమ్ మీద నమ్మకం లేకపోవడంతో అట్లీతో సినిమా చేస్తున్నాడు బన్నీ.

ఈసారి త్రివిక్రమ్ మొండిచెయ్యి ఎన్టీఆర్ కు
అజ్ఞాతవాసితో ఫ్లాప్ ఇచ్చినప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఏ హీరో ముందకు రాలేదు. అటువంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత చేసి త్రివిక్రమ్ ను నిలబెట్టాడు. తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా రావాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అల్లు అర్జున్ మొండిచెయ్యి చూపించడంతో తారక్ కు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు.
డ్రాగన్ సినిమా షూటింగ్ పూర్తవగానే ఇది చేద్దామనుకుంటున్న సమయంలో హఠాత్తుగా బన్నీ రంగంలోకి దిగాడు. త్రివిక్రమ్ కు ఫ్లాప్ సినిమా వచ్చినప్పుడు కసిగా చేసి సూపర్ హిట్ సినిమా ఇస్తున్నాడు అనే విషయాన్ని గమనించి సినిమా చేయడానికి మొగ్గుచూపించాడు. దీంతో త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పాడు. వీరిద్దరూ కలిసి తారక్ ఏం చెప్పారో అభిమానులకు తెలియదు కానీ.. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం వీరిద్దరిపై మండిపడుతున్నారు.
రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి
సినీ పరిశ్రమలో రాజకీయాలు ఎలా ఉంటాయనేదానికి ఇది నిదర్శనమని, బావా, బావా అంటూ చెట్టపట్టాలేసుకొని తిరిగిన బన్నీ, తారక్.. సినిమా కథ విషయానికి వచ్చేసరికి సన్నివేశాలన్నీ మారిపోయాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన సినిమాలు చెప్పే విలువలు బయట పాటించరని, అందుకు చాలా ఉదాహరణలున్నాయని, తాజాగా ఇది కూడా మరో ఉదాహరణ అని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
పూనమ్ కౌర్ విషయంలో త్రివిక్రమ్ ఇంతవరకు నోరు తెరిచి మాట్లాడకపోతుండటంతోనే అర్థమవుతోందని తప్పంతా త్రివిక్రమదేనని, ఇప్పుడు మరోసారి తనను కష్టాల్లో ఆదుకున్న ఎన్టీఆర్ ను కాదని బన్నీతో చేస్తున్నాడని, ఫ్లాప్ సినిమాలు, నువ్వు ప్రయోగాలు చేయడానికి మహేష్ బాబు కావాలి, హిట్లు కొట్టడానికి అల్లు అర్జున్ కావాలా? అంటూ మధ్యలో మహేష్ బాబు అభిమానులు కూడా త్రివిక్రమ్ ను, బన్నీని తగులుకుంటున్నారు.












Click it and Unblock the Notifications