కిరణ్ అబ్బవరంకు 'సారీ' చెప్పిన అల్లు అర్జున్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 డిసెంబరు ఐదోతేదీన ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్లలో విడుదల కాబోతోంది. మొదటిరోజు రూ.250 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను పాట్నాలో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి విడుదల చేశారు. విడుదలైన 14 గంటల్లోనే 42 మిలియన్ల వ్యూస్ దక్కించుకొని ఇతర హీరోల రికార్డులను బద్దలు కొట్టేసింది. 24 గంటలు గడిచేసరికి మరెన్ని రికార్డులను బద్దలు కొడుతుంది? కొత్తగా ఎన్ని రికార్డులను సృష్టిస్తుంది? అనేది తెలియాలంటే కొంత సమయం ఆగాలి.

ట్రైలర్ పై ట్వీట్ చేసిన కిరణ్ అబ్బవరం
ఈ సినిమా ట్రైలర్ పై సినీరంగానికి చెందిన ప్రముఖులంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోరీతిలో అల్లు అర్జున్ కు అభినందనలు చెబుతున్నారు. ఈ క్రమంలో క సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన కిరణ్ అబ్బవరం కూడా ట్రైలర్ బాగుందంటూ ట్వీట్ చేశాడు. దీనికి అల్లు అర్జున్ స్పందించారు. థాంక్యూ మై బ్రదర్.. అలాగే క సినిమాతో ఘనవిజయాన్ని సాధించినందుకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. కొంచెం బిజీగా ఉండటంవల్ల క సినిమాను చూడలేకపోయానని, కచ్చితంగా ఈ సినిమాను చూస్తానని, చూసిన తర్వాత నీకు కాల్ చేస్తానంటూ సమాధానమిచ్చాడు.

Allu Arjun apologizes to Kiran Abbavaram for not watching the movie ka

ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అల్లు అర్జున్ ఎంతో నిరాడంబరంగా వ్యవహరించారని ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. మొదటినుంచి బన్నీ ఇదే తరహా నిరాడంబరంగా ఉంటాడని, అందుకే ఈ స్థాయికి చేరుకున్నాడని, స్వయంకృషితో తనను తాను తీర్చిదిద్దుకున్న గొప్ప వ్యక్తి అంటూ కొనియాడుతున్నారు. పుష్ప1తో ఉత్తర భారతదేశంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను బన్నీ సంపాదించుకున్నాడు. మూడు సంవత్సరాల నుంచి అభిమానులు పుష్ప2 కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగులోకన్నా హిందీలోనే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఉన్నారంటే అక్కడి ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగా నచ్చిందో అర్థమవుతోంది. కొంచెం బాగున్నా సరే.. ఈ సినిమా కచ్చితంగా రూ.1200 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు కలెక్షన్లు వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+