అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ లీక్ అయ్యిందంటూ ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేయాలని చిత్ర బృందం ఇప్పటికే ప్లాన్ చేసింది.
'లెగసీ' టైటిల్ చుట్టూ రచ్చ
ఇంతలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ స్క్రీన్ షాట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో 'లెగసీ' అనే పదం స్పష్టంగా కనిపిస్తుండటంతో ఇదే ఈ సినిమా టైటిల్ అని అభిమానులు భావిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం అది సినిమా టైటిల్ కాదని, ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ కంపెనీ పేరు అయ్యుంటుందని భావిస్తున్నారు. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఏప్రిల్ 8 వరకు వేచి చూడాల్సిందే.

వీడియో గ్లింప్స్ ప్లాన్ రద్దు.. కారణం అదేనా?
వాస్తవానికి అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా ఓ చిన్న వీడియో గ్లింప్స్ విడుదల చేసి.. ఈ సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలని అట్లీ భావించాడు. కానీ చివరి నిమిషంలో ఆ ప్లాన్ రద్దు చేసుకున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం వీఎఫ్ఎక్స్ క్వాలిటీ అని తెలుస్తోంది. సిద్ధం చేసిన గ్లింప్స్‌లో గ్రాఫిక్స్ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో అరకొర క్వాలిటీతో వీడియోను వదిలి సినిమా హైప్‌ను తగ్గించడం ఇష్టం లేక చిత్ర యూనిట్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. దీంతో కేవలం పోస్టర్ రివీల్‌కే పరిమితం కావాలని నిర్ణయించుకున్నారు.
భారీ కాస్ట్.. సమ్మర్ రిలీజ్
ఈ సినిమాలో నటీమణుల ఎంపిక కూడా అత్యంత ఆసక్తికరంగా ఉంది. దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, అనుష్క శర్మ వంటి స్టార్ హీరోయిన్లు ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అందరి దృష్టి ఏప్రిల్ 8వ తేదీపైనే ఉన్నాయి. ఆ రోజున 'లెగసీ' అనేదే టైటిలా? లేక మరో సర్‌ప్రైజ్ ఇస్తారా? అనేది తెలిసిపోనుంది.
-
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. డకాయిట్ కొట్టేలా ఉన్నాడు! -
టాలీవుడ్లో మళ్లీ 'క్యాస్టింగ్ కౌచ్' కలకలం.. రంగంలోకి పూనమ్ కౌర్! -
టాలీవుడ్ రారాజు "రెబల్ స్టార్" ఆస్తి ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం పక్కా !! -
రణ్‌బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా? -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ.. -
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్.. తెలుగు ఎన్నారై ఇన్ ఫ్లూయెన్సర్ వీడియో వైరల్ ! -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ???










Click it and Unblock the Notifications