అల్లు అర్జున్ కారు డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. పుష్ప సినిమాతో జాతీయంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న బన్నీ ప్రస్తుతం కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. పుష్ప2 షూటింగ్ జరుగుతోంది. తాజాగా జర్మనీ రాజధాని బెర్లిన్ లో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ కు అతిథిగా హాజరై పుష్ప గురించిన కబుర్లను అక్కడ పంచుకున్నారు. పుష్ప3 కూడా వచ్చే అవకాశం ఉందని, దీన్ని ఒక ఫ్రాంచైజీగా తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.
పెద్ద స్టార్ నటుడిగా ఉన్న బన్నీ తన దగ్గర పనిచేసే ఉద్యోగులను మాత్రం సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. ఈ విషయాన్ని ఆయన దగ్గర పనిచేసేవారు ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో చెప్పారు. షూటింగ్స్ కోసం అల్లు అర్జున్ క్యారవాన్ ఉపయోగిస్తుంటారు. దీనికి డ్రైవర్ గా లక్ష్మణ్ ఉన్నారు. తను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బన్నీకి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

దర్శకుడు బోయపాటి శ్రీను దగ్గర లక్ష్మణ్ పనిచేసేవాడు. అల్లు అర్జున్ కు వీరాభిమాని. బోయపాటి నుంచి అల్లు అర్జున్ దగ్గర చేరిన తనకు బన్నీ ఎంతో గొప్ప మనసున్న వ్యక్తి అని అర్థమైనట్లు తెలిపారు. అల వైకుంఠపురం సినిమా విడుదలైన తర్వాత తామెవరూ ఊహించని రీతిలో బోనస్ గా తమకు పెద్ద మొత్తంలో డబ్బును కానుకగా ఇచ్చారని లక్ష్మణ్ చెప్పారు.
క్యారవాన్ నిర్వహించాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం. తన క్యారవాన్ తయారు చేయించుకుంటున్న సమయంలోనే పూణెలో నెలరోజులపాటు లక్ష్మణ్ అక్కడే ఉండి అందుకు సంబంధించిన అన్ని పనులు నేర్చుకున్నాడు. నెలకు రెండు లక్షల రూపాయలు జీతం అందుకుంటున్న లక్ష్మణ్ పుట్టినరోజుకు ప్రతి ఏడాది బన్నీ ఒక కేక్ తెప్పించి స్వయంగా తనచేత కట్ చేయిస్తారని వెల్లడించాడు.












Click it and Unblock the Notifications