వాళ్లను తెరపైకి తీసుకొచ్చిన ఐకాన్ స్టార్- వాట్ నెక్స్ట్.. !?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం తన కొత్త సినిమా కార్యక్రమాల్లో బీసీగా ఉన్నాడు. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తోన్న సైంటిఫిక్ మాస్ ఎంటర్టైనర్ ఇది. అల్లు అర్జున్ కు ఇది 22వ మూవీ. అలాగే- అట్లీకి ఇది ఆరో సినిమా. దీని వర్కింగ్ టైటిల్.. 'AA22 x A6'. 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్.. ఈ సినిమాను నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కబోతోంది అల్లు అర్జున్- అట్లీ మూవీ.

ఈ పరిణామాల మధ్య అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో హైదరాబాద్‌లో ఆ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దాదాపు అయిదు గంటల పాటు కొనసాగిందంటే.. దీనికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ అధ్యక్షులు శివశంకర్, అంజి యాదవ్ సారథ్యాన్ని వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

Allu Arjun Clear Strategy Drives Fan Network Growth in AP and Telangana Widens Influence Through Committee

భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడానికి సంబంధించి సన్నాహక ప్రణాళికలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎంపికైన ప్రతినిధులకు వారి పాత్రలు, బాధ్యత గురించి స్పష్టంగా వివరించారు. ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు స్టేట్ లెవల్ కమిటీతో పాటు డిస్ట్రిక్ట్, టౌన్ లెవల్ కమిటీల ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యక్రమాలను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని అసోసియేషన్ నాయకులు తెలిపారు. అలాగే, ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సమావేశంలో వెల్లడించారు. అల్లు అర్జున్ ప్రతిభ, క్రమశిక్షణ, విలువలను ప్రతిబింబించే విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు కొనసాగాలని నేతలు పేర్కొన్నారు.

అభిమానుల మధ్య ఐక్యత అలవర్చుకోవాలని, సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించుకోవాలని అల్లు అర్జున్ ఇచ్చిన సందేశాన్ని ఈ సందర్భంగా వాళ్లు వినిపించినట్లు తెలుస్తోంది. ఆయనపై ఉన్న అభిమానాన్ని సామాజిక సేవ వైపు మళ్లించడం ఈ కమిటీల ముఖ్య ఉద్దేశమని వారు స్పష్టం చేశారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వం, క్రమశిక్షణ, సమాజం పట్ల ఆయనకు ఉన్న బాధ్యతా భావాన్ని ప్రతిబింబించే విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యక్రమాలు ఉండాలని నాయకులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+