pushpa2: 'పుష్ప2' లో మెగా ఫ్యామిలీపై నేరుగా అల్లు అర్జున్ కౌంటర్లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప2 చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ వసూళ్లను కొల్లగొట్టే అవకాశం ఉంది. ప్రధానంగా సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు, అల్లు అర్జున్ నటన తోడుకావడంతో బన్నీ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. దక్షిణాదిలో ఎక్కువ కలెక్షన్లు వస్తాయా? ఉత్తరాదిలో ఎక్కువ కలెక్షన్లు వస్తాయా? అనేది ఇప్పుడు ప్రధాన పాయింట్ గా మారింది. ఎందుకంటే ఉత్తరాది ప్రేక్షకులు పుష్ప సినిమాను, అల్లు అర్జున్ ను తమవాడిగా భావిస్తున్నారు.

మెగా ఫ్యామిలీపై కౌంటర్లు
ఈ సినిమాలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీపై కౌంటర్లు వేసినట్లు అర్థమవుతోంది. కొన్నాళ్లుగా మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఇంకా ముదిరి తీవ్రస్థాయికి చేరింది. సోషల్ మీడియాలో మెగా అభిమానులకు, అల్లు అర్జున్ అభిమానులకు నిత్యం యుద్ధం నడుస్తుంటుంది. ఇటువంటి పరిస్థితుల మధ్య పుష్ప2 విడుదలైంది. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో కొన్ని డైలాగులు అల్లు అర్జున్ చెబుతాడు. వాటిని కావాలనే రాయించినట్లు అందరికీ అర్థమవుతోంది.

allu arjun counter on mega family in pushpa 2 movie

మీ బాస్ కు నేనే బాస్
'మీ బాస్‌కు కూడా నేను బాస్‌ను' అంటాడు. వాస్తవానికి చిరంజీవిని బాస్ అని పిలుస్తుంటారు. ఆ బాస్ కు కూడా తానే బాస్ అనే అర్థం వచ్చేటట్లుగా ఈ డైలాగ్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని తర్వాత 'ఒక‌డు ఎదుగుతుంటే చూడ‌లేక వాడు డౌన్ కావాల‌ని కోరుకునేవాళ్లు చాలా మందే ఉంటారు' అని హీరో అంటాడు. మెగా అనే పేరు లేకుండా వ్యక్తిగత ఇమేజ్ తో తనకు తాను ఎదుగుతుంటే తాను కిందకు పడిపోవాలని మెగా అభిమానులతోపాటు మరికొందరు కోరుకుంటున్నారనే అర్థం వస్తోంది. మరో డైలాగ్ ఉంది. 'ఎత్తులో ఉన్న‌ప్పుడు ఈగోలు ఉండ‌కూడ‌దు' అంటాడు. ఇవన్నీ కావాలని రాయించినట్లుగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అల్లు అర్జున్ ఎత్తులో ఉన్నప్పుడు ఎటువంటి ఈగోలు మెగా కుటుంబంలో ఉండకూడదనే అర్థం ఇందులో ఉందంటున్నారు. అటువంటి ఈగోలు లేకుండా కలిసిపోవాలనేది అల్లు అర్జున్ అభిప్రాయం కావచ్చు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+