అల్లు అర్జున్‌కి వావి వరసలు తెలియదా..?

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదంటే అతిశేయోక్తి కాదు. అల్లు అర్జున్‌కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. తెలుగు, కన్నడలో అల్లు అర్జున్‌కు మంచి క్రేజ్ ఉంది. పుష్ప సినిమాతో ఇండియా మొత్తం తనవైపు తిప్పుకునేలా చేశాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు గెలుచుకుని సత్తా చాటాడు. నేషనల్ అవార్డు గెలుచుకున్న ఏకైక తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.

సోమవారం అల్లు అర్జున్‌ పుట్టిన రోజు కావడంతో ఆయన అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. తమ అభిమాన హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో హంగామా సృష్టించారు. మరోవైపు తోటి హీరోలు కూడా అల్లు అర్జున్‌కు బర్త్ డే విషెష్ తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా అల్లు అర్జున్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే బన్నీ జాతీయ అవార్డు గ్రహిత, అభినయ కౌశలం కలిగిన కథానాయకుడు అల్లు అర్జున్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ..భవిష్యత్తులో అల్లు అర్జున్ మరిన్ని పురస్కారాలు , విజయాలు అందుకోవాలంటూ పవన్ కల్యాణ్ బన్నికి బర్త్ డే విషెష్ చెప్పారు.

Allu Arjun Criticized For Calling Pawan Kalyan Babai

పవన్ కల్యాణ్ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంపై అల్లు అర్జున్ రియాక్ట్ అవుతూ...థాంక్యూ వెరీ మచ్ బాబాయ్..నా హార్ట్‌ను టచ్ చేశారంటూ రిప్లై ఇచ్చాడు.అయితే దీనిపై నెటిజన్లు అల్లు అర్జున్‌పై మండిపడుతున్నారు. అల్లు అర్జున్‌కు పవన్ కల్యాణ్ బాబాయ్ అవ్వరని..మావయ్య అవుతారని గుర్తు చేస్తున్నారు. అల్లు అర్జున్‌కి వావి వరసలు తెలియదనుకుంటా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే దీనిపై బన్ని అభిమానులు గట్టిగానే వారికి కౌంటరిస్తున్నారు. బన్ని చిన్నప్పటి నుంచి రామ్ చరణ్‌తో కలిసి పెరిగాడని..అతనితో పాటు పవన్ కల్యాణ్‌ను అల్లు అర్జున్ కూడా బాబాయ్ అని పిలుస్తాడని.. ఇందులో తప్పు ఏముందని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో ఆయన నటిస్తోన్న పుష్ఫ-2 మూవీ టీజర్‌ను ఈ రోజు విడుదల చేశారు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+