అల్లు అర్జున్‌కి వావి వరసలు తెలియవా...?
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదంటే అతిశేయోక్తి కాదు. అల్లు అర్జున్‌కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. తెలుగు, కన్నడలో అల్లు అర్జున్‌కు మంచి క్రేజ్ ఉంది. పుష్ప సినిమాతో ఇండియా మొత్తం తనవైపు తిప్పుకునేలా చేశాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు గెలుచుకుని సత్తా చాటాడు. నేషనల్ అవార్డు గెలుచుకున్న ఏకైక తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.
ఇక పుష్ప-2 సినిమాతో మరోసారి ఇండియా మొత్తం కూడా తనవైపు తిప్పుకునేలా చేశాడు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 294 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో మొదటిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ..ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమయంలో అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.

అయితే ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌ను బాబాయ్ అని సంబోధించారు. అయితే దీనిపై నెటిజన్లు అల్లు అర్జున్‌పై మండిపడుతున్నారు. అల్లు అర్జున్‌కు పవన్ కల్యాణ్ బాబాయ్ అవ్వరని..మావయ్య అవుతారని గుర్తు చేస్తున్నారు. అల్లు అర్జున్‌కి వావి వరసలు తెలియదనుకుంటా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై బన్ని అభిమానులు గట్టిగానే వారికి కౌంటరిస్తున్నారు. బన్ని చిన్నప్పటి నుంచి రామ్ చరణ్‌తో కలిసి పెరిగాడని..అతనితో పాటు పవన్ కల్యాణ్‌ను అల్లు అర్జున్ కూడా బాబాయ్ అని పిలుస్తాడని.. ఇందులో తప్పు ఏముందని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications