సంధి కాదు సమరమే..మెగా ఫ్యామిలీపై ఆ ఒక్క మాటతో తేల్చేసిని అల్లు అర్జున్
మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకి మరింత ముదురుతోంది. పైకి అంతా బాగానే ఉన్నప్పటికి లోలోపల మాత్రం ఇరు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఇక అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. మెగా అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకుంటున్నారు.అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, దానికి బన్ని అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వడం చక చక జరిగిపోయాయి. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేశారు.
మెగా ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇటీవల మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు సందర్బంగా అల్లు అర్జున్ , ఆయన భార్య స్నేహారెడ్డి ఎవరూ స్పందించలేదు. ఇది చాలదన్నట్టు పవన్ కల్యాణ్ ఇటీవల అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడువులను కాపాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇప్పుడున్న హీరోలు అడువులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. నేను ఇండస్ట్రీకి చెందిన వాడినేనని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఇలాంటి సినిమాలు చేయడానికి తాను చాలా ఇబ్బంది పడతానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేశారని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలతో మెగా , అల్లు వివాదం మరింత ముదిరినట్టు అయింది. తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మరింత అజ్యం పోసినట్టు అయింది. సుకుమార్ భార్య నిర్మాతగా వ్యవహరించిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ హాజరయారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదానికి కేరాఫ్‌గా నిలిచాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మై డియర్ ఫ్యాన్స్.. మీరే నా ఆర్మీ, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లయినా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే. నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా.. అది మీ అందరికి తెలుసంటూ కామెంట్ చేశారు. ఈ ఒక్క మాటతో మెగా ఫ్యామిలీతో తనకున్న బంధాన్ని తేల్చేసినట్టు అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో బన్నీ మెగా ఫ్యామిలీతో సంధి కోసం ప్రయత్నించడం లేదని స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications