రామ్ చరణ్‌కు షాకిచ్చిన అల్లు అర్జున్.. మెగా బంధానికి స్వస్తి..?

మెగా , అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఈ రెండు ఫ్యామిలీల మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. అప్పటి నుంచి మెగా , అల్లు ఫ్యామిలీల మధ్య గొడవలు మొదలైయ్యాయి.మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు.

Take a Poll

అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది.అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా సమయంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా మెగా అభిమానులు, కూటమి ఎమ్మెల్యేలు మాట్లాడటం జరిగింది. మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెబితేనే , పుష్ప-2 సినిమా ఏపీలో విడుదల అవుతుందంటూ వార్నింగ్ ఇచ్చారు.

Allu Arjun didn t wish Ram Charan on his birthday

పుష్ప-2 సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పటికీ , మెగా హీరోలెవ్వరూ కూడా స్పందించలేదు.అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్‌లో కూడా మెగా ఫ్యామిలీ సెలైంట్‌గానే ఉంది. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎవరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించలేదు.కనీసం ఆయన్ను ఇంటికి వెళ్లి పరామర్శించలేదు. ఇదే సమయంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ఫ్లాప్ గురించి అల్లు అరవింద్ సెటైర్లు వేయడం జరిగింది. దీంతో మెగా , అల్లు ఫ్యామిలీ మధ్య దూరం మరింత పెరిగినట్టు అయింది. గురువారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు. దీంతో పలువురు సెలబ్రిటీలు ఆయనకు బర్త్ డే విషెష్ చెబుతున్నారు.ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కల్చాణ్ వంటి స్టార్ హీరోలు రామ్ చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే అల్లు అర్జున్ మాత్రం రామ్ చరణ్‌కు పుట్టిన రోజు విషెష్ చెప్పలేదు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌ను రామ్ చరణ్ అన్‌ఫాలో చేశారు. ఆ కారణంగానే రామ్ చరణ్‌కు పుట్టిన రోజుపై అల్లు అర్జున్ రియాక్ట్ కాలేదని తెలుస్తోంది. సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌ను రామ్ చరణ్ అన్‌ఫాలో చేశారు.సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అన్‌ఫాలో చేయడంతో , ఇరు కుటుంబాల మధ్య గ్యాప్ మరింత పెరిగినట్టు అయింది. మరోవైపు రామ్ చరణ్ భార్య ఉపాసన మాత్రం అల్లు అర్జున్‌ను ఫాలో అవుతూనే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+