రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్.. భలే కవర్ చేశారే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ 'పుష్ప-2' సినీ యావత్తు మొత్తం కూడా ఎంతో అతృతుగా ఎదురు చూసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సుకుమార్- అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేశారనే చెప్పాలి. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే జాతర సీన్ సినిమాకై హైలెట్‌గా నిలిచింది. లేడీ గెటప్‌లో అల్లు అర్జున్ ఇరగదీశాడు. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 294 కోట్ల వసూళ్లు రాబట్టింది.
దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో మొదటిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ..ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. టికెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన రెండు తెలుగు రాష్ట్రా ప్రభుత్వాలకు అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వానికి కూడా అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పారు.అయితే ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు గుర్తుకు రాలేదు. దీంతో వాటర్ తాగడానికి కొంత సమయం తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు.నెటిజన్లు దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ముఖ్యమంత్రి పేరును అల్లు అర్జున్ మరిచిపోయారని షేర్ చేస్తున్నారు. అంతటి పెద్ద వ్యక్తుల్ని మర్చిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మిగతా హీరోలు అయినా కూడా జాగ్రత్త చర్యలు తీసుకొని సినిమాకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications