పుష్ప 3 గురించి సెన్సెషనల్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్...
టాలీవుడ్‌లో పుష్ప సినిమా తెచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో అల్లుఅర్జున్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ సినిమాలో తను కనబరచిన ప్రదర్శనకు అవార్డులు కూడా ఆయనను వరించాయి. జాతీయ అవార్డ్‌తో పాటు..గ్లొబల్ ఇమేజ్ కూడా అల్లుఅర్జున్ వశమయ్యాయి. త్వరలోనే పుష్ప 2 కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. పుష్ప సినిమా రెండు పార్టులుగానే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ, పుష్ప 3 కూడా ఉండబోతుందట. తాజాగా, పుష్క 3 గురించి అల్లుఅర్జున్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప సినిమాతో గ్లోబల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు అల్లుఅర్జున్. ఈ సినిమాతో అల్లుఅర్జున్‌కు దేశ వ్యాప్తంగానే కాకుండా రష్య, జపాన్, చైనా వంటితోపాటు చివరికి పాకిస్తాన్‌లో కూడా అభిమానులు ఏర్పడ్డారు. అక్కడ కూడా ఈ సినిమా విజయ పతాకం ఎగురవేసింది. దాంతో పుష్ప సీక్వెల్ కోసం ప్రేక్షకులకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పుష్ప2 మరికొద్దిరోజుల్లోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

Recommended Video

బెర్లిన్ ఫెస్టివల్లో అల్లు అర్జున్ : ఇటీవలే జర్మనీలో జరిగిన ప్రతిష్టాత్మక బెర్లిన్ ఫెస్టివల్లో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈక్రమంలో ఆయన పుష్ప సినిమా గురించి ఓ కొత్త అప్‌డేట్‌ను అందించారు. అదేంటంటే.. పుష్ప3 మూవీ. పుష్ప2 తో పాటు. పార్ట్ 3 కూడా రాబోతున్నట్టు సమాచారం. తాజాగా బెర్లిన్ లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ కి హాజరైన అల్లు అర్జున్ ఈ ఫ్రాంచేజ్ మూవీగురించి ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. బెర్లిన్ లో పుష్ప ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా పుష్ప సినిమా గురించి అల్లుఅర్జున్ మాట్లాడారు.
పుష్ప సినిమాను ప్రత్యేకంగా ఆ ఫెస్టివల్ లో ప్రదర్శిస్తుండడంతో దానిని అక్కడి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాని తెలిపారు.ఈ సందర్భంగా పుష్ప 3 గురించి అల్లుఅర్జున్ మాట్లాడారు. పుష్ప 3 సినిమా కచ్చితంగా ఉండొచ్చని ఐకాన్ స్టార్ అన్నారు. దానికి సంబంధించి మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి అల్లు అర్జున్ అన్నారు. ఇక పుష్ప సినిమాని ఫ్రాంచైజ్ లుగా మార్చాలని అంటుకుంటున్నట్లు ఆయన అన్నారు. దీనితో పుష్ప 3 ఖచ్చితంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ సెన్సెషనల్ కామెంట్స్ కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications