యాక్సిడెంట్ అయింది.. ఆరు నెలలు రెస్ట్.. అల్లు అర్జున్ సంచలన స్టేట్ మెంట్

ప్రముఖ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాక్సిడెంట్ అయింది.. ఆరు నెలలు రెస్ట్.. అప్పుడు లైఫ్ అర్థమైందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ముంబై వేదికగా నాలుగు రోజులపాటు జరగనున్న 'వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌' (వేవ్స్‌) లో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అందరూ షాక్ తిన్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఫిట్‌నెస్‌, తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. 'నా 10వ సినిమా షూటింగ్ తర్వాత నాకు యాక్సిడెంట్‌ జరిగింది. అప్పుడు నా భుజం గాయపడింది. అంతకుముందు చిన్న సర్జరీ అయింది. మూడు వారాలు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత జిమ్ కు వెళ్లాను.

ఈసారి కూడా అలాగే అవుతుందిలే అనుకున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే 6 నెలలు రెస్ట్ తీసుకోవాలి అన్నారు. నేను అసలు ఊహించలేదు. కానీ రెండు మూడు నెలల్లో నా నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలి. అప్పుడు నేను చాలా భయపడ్డాను. నా 11వ సినిమా నుంచి యాక్టింగ్ మీద, ఫిట్‌నెస్ మీద, ప్రతి సీన్ మీద మరింత ఫోకస్ చేసాను అని తెలిపాడు.

Allu Arjun Makes Impactful Remarks at Waves Summit

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన సినిమా 'పుష్ప 2: ది రూల్'. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసి, సరికొత్త రికార్డులు సృష్టించింది.

బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. రూ.1870 కోట్లకు పైగా వసూళ్లతో ఏకంగా ఇండియన్ సినిమా రికార్డ్ క్రియేట్ చేసి, చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఓ చిత్రం చేయనున్నారు అల్లు అర్జున్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+