అల్లు అర్జున్ వదులుకున్న 5 బ్లాక్ బస్టర్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. పుష్ప2 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన దీన్ని విడుదల చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సుకుమార్ దర్శకుడు. బన్నీ ఈ సినిమాతో జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
జయం : ఈ సినిమాలో మొదట అల్లు అర్జున్ అనుకున్నారు. బన్నీకి ఇది సరైన సినిమా అవుతుందని అరవింద్ కూడా భావించారు. తేజ డైరెక్షన్ లో పరిచయం కావడం కూడా సరైన వేదిక అనుకున్నారు. అయితే అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. నితిన్ హీరోగా తెరకెక్కింది.

భద్ర : డైరెక్టర్ బోయపాటి శ్రీను సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవాడు. ఆ సమయంలో భద్ర కథ రాసుకున్నారు. దీన్ని మొదటిసారిగా అల్లు అర్జున్ కే వినిపించారు. అయితే ఆర్య లాంటి ప్రేమ కథ చేస్తుండటంవల్ల ఈ తరహా మాస్ సినిమాకు దూరంగా ఉండాలనుకున్నారు. దీంతో ఆయన ఈ చిత్రం చేయలేదు. రవితేజ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ అందుకుంది.
100 పర్సెంట్ లవ్ : తాను కథ ఏదిరాసుకున్నా సుకుమార్ అల్లు అర్జున్ కు చెబుతాడు. అయితే ఈ కథకు బన్నీ కనెక్ట్ కాలేకపోయాడు. ఈ కథ తనకు సెట్ అవదని భావించాడు. దీంతో నాగచైతన్య హీరోగా, తమన్నా హీరోయిన్ గా తెరకెక్కి సూపర్ హిట్ అందుకుంది.
అర్జున్ రెడ్డి : ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా అల్లు అర్జున్ హీరోగా చేయాలనుకున్నాడు. అయితే ఎందుకో ఈ కథ విన్న బన్నీ ధైర్యం చేయలేకపోయాడు. ఆర్య 2 సినిమాలో క్యారెక్టర్ కూడా దీనికి దగ్గరగా ఉండటంతో వెనకడుగు వేశాడు. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ గా మారారు. సందీప్ రెడ్డి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.
గీతగోవిందం : పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అర్జున్ రెడ్డిద్వారా విజయ్ దేవరకొండకు లైఫ్ ఇచ్చిన అల్లు అర్జున్ మరోసారి సూపర్ హిట్ చిత్రాన్ని విజయ్ కు ఇచ్చారు. కథలో హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా ఉండటంతో స్టార్ ఇమేజ్ కు భంగం కలుగుతుందని వదులుకున్నారు.












Click it and Unblock the Notifications