తన కెరీర్‌లో అల్లు అర్జున్ వదులుకున్న బ్లాక్‌బస్టర్లు

ప్రస్తుతం పుష్ప2 సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని సాధించడమే కాదు.. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు అందించిన చిత్రంగా నిలపాలని చూస్తున్నారు. ఈ సినిమా మరో రూ.150 కోట్లు సాధిస్తే రూ.2వేల కోట్లు సాధించిన దంగల్ సినిమాను అధిగమిస్తుంది. అదనంగా 20 నిముషాల సన్నివేశాలను కలపడంతో దేశవ్యాప్తంగా కలెక్షన్లు పెరుగుతాయని భావిస్తున్నారు. తర్వాత సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానరుపై రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభం నుంచి కొన్ని సినిమాలను వదులుకున్నారు. అవన్నీ బ్లాక్ బస్టర్లు అవడం విశేషం.

మాస్ చిత్రం అయితే బాగోదని వద్దనుకున్నారు
తేజ దర్శకత్వంలో నితిన్, సదా నటించిన జయం సినిమా ముందుగా బన్నీ దగ్గరకే వచ్చింది. అల్లు అరవింద్ కూడా అర్జున్ కు సరిపోతుందని భావించారు. అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోవడంతో దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. సినిమా సూపర్ హిట్ అయింది. దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకుడిగా పరిచయమవుతూ దిల్ నిర్మించిన భద్ర సినిమా కూడా బన్నీ చేయాల్సి ఉంది. ఆర్య లాంటి ప్రేమకథా చిత్రం చేస్తున్న తరుణంలో ఈ తరహా మాస్ చిత్రం బాగోదని తిరస్కరించారు. సుకుమార్ దగ్గరే బోయపాటి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం విశేషం. అక్కడ చేస్తూనే భద్ర కథ రాసుకున్నారు. చివరకు రవితేజతో రూపొందించి భారీ హిట్ కొట్టారు.

allu arjun missed block buster movies details here

హీరోను డామినేట్ చేస్తుందని వద్దన్నారు
100 పర్సెంట్ లవ్ సినిమాను సుకుమార్ బన్నీతో చేయాలనుకున్నారు. అయితే తనకు ఈ కథ సెట్ అవదని తిరస్కరించారు. దీంతో నాగచైతన్య-తమన్నాతో తెరకెక్కించిన సుకుమార్ సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోగా బన్నీ ఖాతాలోకి సూపర్ హిట్ మిస్ అయింది. దీనితర్వాత అర్జున్ రెడ్డి సినిమాను అల్లు అర్జున్ తో చేయాలని సందీప్ రెడ్డి వంగా తీవ్రంగా ప్రయత్నించారు. అయితే హీరో క్యారెక్టరైజేషన్ విధానాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా? లేదా? అన్న సందేహంతో దాన్ని వదులుకున్నారు. విజయ్ దేవరకొండ ఈ సినిమా చేసి రాత్రికి రాత్రే స్టార్ హీరో అయ్యాడు. తర్వాత పరశురామ్ దర్శకత్వంలో విజయ్-రష్మిక నటించిన గీత గోవిందం సినిమా కూడా బన్నీ చేయాల్సి ఉంది. అయితే హీరోయిన్ క్యారెక్టర్ హీరోను డామినేట్ చేసేవిధంగా ఉందని భావించిన అల్లు అర్జున్ దాన్ని వద్దునుకోవడంతో గీతా ఆర్ట్స్ బ్యానరులోనే ఈ సినిమా విజయ్-రష్మికతో తెరకెక్కి అద్భుత విజయాన్ని అందుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+