అల్లు అర్జున్ మిస్ చేసుకున్న బ్లాక్‌బస్టర్లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీన్ని పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐదుగురు కథానాయికలకు ఇందులో చోటుంది. దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, జాన్వీకపూర్ ఖరారయ్యారు. భాగ్యశ్రీబోర్సేతో చర్చలు జరుపుతున్నారు. మరో హీరోయిన్ ఖరారు కావల్సి ఉంది. నజ్రియా నజీం అల్లు అర్జున్ చెల్లెలు పాత్ర పోషిస్తోంది. సన్ మూవీస్ పతాకంపై కళానిధి మారన్ భారీబడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పుష్ప తర్వాత చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

కొన్ని కథలు నచ్చక, మరికొన్ని డేట్లు ఖాళీలేక..
అల్లు అర్జున్ తన కెరీర్ లో కొన్ని సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నారు. ముందుగా కథలు తనవద్దకే రాగా కొన్ని కథలు నచ్చక, మరికొన్నిసార్లు డేట్లు ఖాళీలేక వాటిని వదులుకోవాల్సి వచ్చింది. వేరే హీరోలతో చేయగా అవి సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. అలాంటివాటిల్లో ముందుగా భద్ర సినిమా ఒకటి.

allu arjun missed block buster movies list details here

దర్శకుడు బోయపాటికి మొదటి సినిమా. జూనియర్ ఎన్టీఆర్ తో అనుకోగా అతనికి ఖాళీ లేకపోవడంతో, అల్లు అర్జున్ దగ్గరకు వెళితే అతను కూడా నో చెప్పాడు. ఆర్య లాంటి ప్రేమ కథ చేస్తూ ఇలా మాస్ సినిమా చేయడం బాగోదనే ఉద్దేశంతో చేయలేదు. చివరకు రవితేజతో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే 100 పర్సెంట్ లవ్ కూడా ఒకటి. సుకుమార్ బన్నీతో చేయాలనుకోగా తనకు సెట్ కాదనే ఉద్దేశంతో చేయలేదు. నాగచైతన్య, తమన్నాతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది.

ఆ సినిమాద్వారానే పరిచయం అవుదామనుకున్నారు
తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా ద్వారానే వెండితెరకు పరిచయం అవుదామనుకున్నారుకానీ అనుకోని కారణాలతో ఇది కుదరలేదు. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీతగోవిందం సినిమా కూడా అల్లు అర్జున్ చేయాల్సింది. సినిమా కథలో హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా ఉండటంతో తన హీరోయిజానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వద్దనుకున్నారు. ఇలా బన్నీ కొన్ని బ్లాక్ బస్టర్లను మిస్ చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+