10 ఏళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ సంచలన రికార్డ్... ఏ హీరోవల్ల అవడంలేదు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 చిత్రం చేస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన విడుదల కాబోతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా చేస్తూనే త్వరలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ షూటింగ్ లో పాల్గొంటారు. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతోంది.
ఈ రెండు సినిమాలు పూర్తికాగానే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అన్నీ పాన్ ఇండియా స్థాయి సినిమాలే. వెండితెరపై అనేక సంచలన రికార్డులు నెలకొల్పిన జూనియర్ ఎన్టీఆర్ టీవీల్లో టెలికాస్ట్ అయ్యే తన సినిమాలద్వారా సరికొత్త టీఆర్పీని సాధించి ఎవరికీ సాధ్యంకాని రికార్డును సొంతం చేసుకున్నారు.

రికార్డును బద్దలు కొట్టలేకపోయిన అల్లు అర్జున్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ సినిమా విడుదలైన తర్వాత మంచి ఘనవిజయాన్ని అందుకుంది. తర్వాత టీవీలో టెలికాస్ట్ అవగా అప్పటివరకు ఏ సినిమాకు, ఏ హీరోకు రానిరీతిలో 29.9 రేటింగ్ సాధించి సంచలన రికార్డు నెలకొల్పింది. తర్వాత ఎన్నో సినిమాలు విడుదలయ్యాయికానీ ఆ రికార్డును అందుకోలేకపోయాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం సినిమా 29.4 రేటింగ్ ను సాధించిందికానీ టెంపర్ రికార్డును బద్దలు కొట్టలేకపోయింది. ఇటీవలే ప్రసారమైన అల్లు అర్జున్ మరో చిత్రం పుష్ప2 కూడా 25.4 రేటింగ్ ను మాత్రమే రాబట్టగలిగింది.
పదేళ్ల నుంచి తగ్గని టీఆర్పీ రేటింగ్
టెంపర్ సినిమా 10 సంవత్సరాల నుంచి టీవీలో ప్రసారమవుతోంది. ఎప్పుడు ప్రసారమవుతున్నా టీఆర్పీ రేటింగ్ 20కి తగ్గడంలేదు. అంతగా ఈ సినిమాకు ఆదరణ లభిస్తోంది. థియేటర్లకు మించి టీవీల్లో ఈ సినిమాను విపరీతంగా చూస్తున్నారు. పది సంవత్సరాలుగా ఒకే టీఆర్పీని దాదాపుగా మెయింటైన్ చేయడమంటే సాధారణమైన విషయం కాదంటున్నారు విశ్లేషకులు. వార్2, డ్రాగన్ సినిమాలతో టీఆర్పీ రేటింగ్ ను 30 నుంచి 35 వరకు సాధించే అవకాశం ఉందని తారక్ అభిమానులు గర్వంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications