మహేష్ బాబు రికార్డ్ ను బద్దలు కొట్టిన అల్లు అర్జున్
అల్లు అర్జున్ మంచి జోరుమీద ఉన్నారు. పుష్ప సినిమా సాధించిన ఘనవిజయంతో పుష్ప2 ను దర్శకుడు సుకుమార్ ఎంతో జాగ్రత్తగా తీస్తున్నారు. దేశంతోపాటు విదేశాల్లో కూడా బన్నీకి క్రేజ్ వచ్చింది. తర్వాత సినిమాను అట్లీ దర్శకత్వంలో చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో రికార్డును బ్రేక్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 25 మిలియన్లను దాటింది. దక్షిణాదిలో ఈ రికార్డు ఏ హీరోకు లేదు. 25 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఏకైకా దక్షిణాది హీరోగా నిలిచాడు.
ఇన్ స్టాగ్రామ్ లో మొదటి స్థానంలో అల్లు అర్జున్, రెండో స్థానంలో విజయ్ దేవరకొండ, మూడోస్థానంలో రామ్ చరణ్, తర్వాత దుల్కర్ సల్మాన్, యశ్, మహేష్ బాబు, ప్రభాస్, విజయ్ దళపతి నిలిచారు. దీనిపై బన్నీ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. మొదటినుంచి సోషల్ మీడియా ఖాతాల్లో అల్లు అర్జున్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మరికొద్దిరోజులు దాటితే దేశవ్యాప్తంగా టాప్ ప్లేస్ లో నిలుస్తాడని బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు. పుష్ప2 సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ గుంటూరు కారం ఫ్లాపవడంతో అతనితో సినిమా చేసే అవకాశం కష్టం అంటున్నారు. దేవర చిత్రం చేస్తున్న కొరటాల శివ కూడా అల్లు అర్జున్ కు కథ వినిపించారంటున్నారు. అయితే దేవర సాధించే విజయాన్నిబట్టి ఆ డైరెక్టర్ తో సినిమా చేయాలా? వద్దా? అనే నిర్ణయాన్ని బన్నీ తీసుకుంటాడు. గతంలో కూడా కొరటాలతో సినిమా చేయాలని ఉందని బన్నీ బహిరంగంగానే చెప్పాడు. అయితే ఆచార్య సినిమా ఫ్లాపవడం కొరటాలకు కష్టాలను తెచ్చిపెట్టింది.












Click it and Unblock the Notifications