అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ డైరెక్టర్ ఫిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో అతి పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. పుష్ప సినిమాలో పోషించిన పుష్పరాజ్ పాత్రకు జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఈ అవార్డు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. దీంతో పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ తోపాటు అల్లు అర్జున్ పై కూడా మరింత బాధ్యత పెరిగింది. పుష్ప2 సినిమాను ఎంతో జాగ్రత్తగా తీస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
కభీ అప్నే కభీ సప్నే
ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. తాజాగా మరోవార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నాడని, ఈ సినిమాతో హిందీలో ప్రవేశించనున్నారంటూ వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాకు కభీ అప్నే కభీ సప్నే అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు పోస్టర్స్ లో కనపడుతోంది.

జవాన్... దక్షిణాది కిచిడీయేనా?
పోస్టర్ లో అల్లు అర్జున్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనపడుతున్నారు. ఒకటి మాస్, మరొకటి క్లాస్ గా ఉంది. అతడి ముఖాన్ని సగం మాత్రమే కనపడేలా డిజైన్ చేశారు. అల్లు అర్జున్ స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్నారంటున్నారు. గతంలో క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ వేదం సినిమా చేశారు. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కభీ అప్నే కభీ సప్నే పోస్టర్ పై త్వరలోనే ఒక స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. జవాన్ డైరెక్టర్ అట్లీ కూడా అల్లు అర్జున్ తో చేయడానికి సుముఖంగా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ అతనితో సినిమా చేయాలా? వద్దా? అనే డైలమాలో పడ్డాడు. ఎందుకంటే దక్షిణాదిలో వచ్చిన పలు హిట్ సినిమాల సన్నివేశాలన్నీ కలిపితే జవాన్ తయారైందనే అభిప్రాయం దక్షిణాదిలో వినపడుతోంది.












Click it and Unblock the Notifications