తేల్చుకుందాం.. మెగా ఫ్యాన్స్‌కు అల్లు ఆర్మీ సవాల్
గత కొద్ది రోజులుగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం అందరికి తెలిసిందే. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.
దీని తర్వాత అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, దానికి బన్ని అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వడం చక చక జరిగిపోయాయి. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేశారు. ఇక ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం..అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. దీంతో మెగా అభిమానులు అల్లు అర్జున్‌ను టార్గెట్‌గా పెట్టుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి అల్లు అభిమానులు సైతం గట్టిగానే కౌంటరిస్తున్నారు.

తాజాగా బన్నీ ఫ్యాన్స్.. మెగా అభిమానులకి సోషల్ మీడియాలో సవాల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్, బన్నీ వర్సెస్ రామ్ చరణ్ అంటూ పోస్టులు పెడుతూ ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందో తేల్చుకుందాం రండి అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. వీటికి మెగా అభిమానులు కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. పుష్ప 2 సినిమాను బ్యాన్ చేస్తామని ఏపీలో కలెక్షన్లపై దీని ప్రభావం ఉంటుందంటూ పోస్టులు చేస్తున్నారు. అయితే సినిమాలో సత్తా ఉంటే, కంటెంట్ ఉంటే ఎవరు ఆపాలని చూసినా తగ్గేదేలే అంటూ బన్నీ అభిమానులు గట్టిగానే మెగా అభిమానులకు కౌంటరిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు వివాదం గట్టిగానే ట్రెండింగ్ అవుతుంది.
Who has More Fanbase?
— Pushpa2TheRule 🐉🪓 (@ChandraCm460305) June 16, 2024
Let's settle it 💥💥💥
🔁 #PawanKalyan ❤️ #Alluarjun pic.twitter.com/m1lURz5kYd
Current Scenario 😥💯#AlluArjun pic.twitter.com/scmAkWkex1
— Negativity Mogudu 🐉🔥✊🏻 (@BharathAadhf1) June 10, 2024
It's official 🔥
— Milagro Movies (@MilagroMovies) June 15, 2024
One Man Against All #AlluArjun ♥️pic.twitter.com/GV7DJ7mm9S












Click it and Unblock the Notifications