దేశవ్యాప్తంగా 'పుష్ప2' ట్రైలర్ ప్రభంజనం... బద్ధలవుతున్న రికార్డులు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం పుష్ప2. ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్ కాగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. సినిమా బడ్జెట్ దాదాపు రూ.400 కోట్లు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను బీహార్ రాజధాని పాట్నాలో విడుదల చేశారు. గాంధీ మైదాన్ లో భారీస్థాయిలో నిర్వహించిన ఈవెంట్ కు రెండు లక్షల మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. కరోనా సమయంలో కూడా బీహార్ లో పుష్ప మొదటి భాగాన్ని ఇక్కడి ప్రేక్షకులు అన్ని రాష్ట్రాలకన్నా అధికంగా ఆదరించారు. దీంతో ట్రైలర్ విడుదలను నిర్మాతలు ఇక్కడే నిర్వహించారు. ఈ సినిమాను హిందీలో అనిల్ తడానీ విడుదల చేస్తున్నారు.

పోస్టర్ విడుదల చేసిన నిర్మాతలు
తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో విడుదలైన ట్రైలర్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ ను దక్కించుకుంటోంది. సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తోంది. అల్లు అర్జున్ సృష్టిస్తున్న రికార్డుల ప్రకంపనలకు అన్ని హీరోల రికార్డులు బద్ధలవుతున్నాయి. ట్రైలర్ లో డైలాగులు విపరీతంగా పాపులర్ అవుతున్నాయి. నటీనటులు చెబుతున్న డైలాగులను ఇప్పుడే ప్రజలకు బయట అనుకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నిర్మాతలు అధికారికంగా ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఇద్దరు స్టార్ హీరోలను వెనక్కి నెట్టి సరికొత్త రికార్డును అందుకున్నట్లు పోస్టర్ లో వెల్లడించారు.

allu arjun pushpa 2 trailer creates sensation records india wide

మహేష్ బాబు, ప్రభాస్ ను వెనక్కి నెట్టి
ఇప్పటివరకు మొదటి స్థానంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, రెండో స్థానంలో ప్రభాస్ సలార్ నిలిచాయి. వీటిని వెనక్కినెట్టి 15 గంటల వ్యవధిలోనే 42 మిలియన్ల వ్యూస్ ను పుష్ప2 దక్కించుకుంది. 24 గంటల వ్యవధి అంటే ఇంకా భారీగా వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ రికార్డుల పరంపరను చూసి బన్నీ అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. హిందీ లో 29 మిలియన్ వ్యూస్, తమిళం లో 3.7, మళయాళం 2, బెంగాలీ లో 5 లక్షల వ్యూస్ వచ్చాయి.

అన్ని భాషలకు కలిపి 70 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది యూట్యూబ్ లో నమోదైన వ్యూస్ అని, రియల్ టైం చూసుకుంటే 100 మిలియన్లను దాటివుంటుందని అంచనా వేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ కు 24 గంటల్లో 70 మిలియన్ల వ్యూస్ రాగా, పుష్ప2 ట్రైలర్ కు 24 గంటలు గడవకముందే 70 మిలియన్లను దాటడం విశేషం. ట్రైలర్ విడుదలైన తర్వాత విదేశాల్లో ఈ సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ వేగం పుంజుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+