పుష్ప2: బంగారంలాంటి అవకాశాన్ని వదులుకున్న అల్లు అర్జున్

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం పుష్ప2. దీనిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా రూ.వెయ్యి కోట్ల వసూళ్ల లక్ష్యంతో రాబోతోంది. రష్మిక, ఫాహద్ ఫజిల్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. డిసెంబరు ఆరోతేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాల నేపథ్యంలో డిసెంబరు ఆరుకు వాయిదా వేశారు.

స్త్రీ2కు దరిదాపుల్లో కూడా లేవు
అయితే ఆగస్టు 15న విడుదల చేసివుంటే బంగారంలాంటి అవకాశాన్ని ఉపయోగించుకునేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు 15 గురువారం రావడం, తర్వాత వరుసగా సెలవు దినాలతోపాటు సోమవారం రాఖీ పౌర్ణమి కూడా కావడంతో కలెక్షన్లు అలా ఇలా కాదని, ఊహించనిరీతిలో వచ్చివుండేవంటున్నారు. ప్రస్తుతం ఆగస్టు 15న విడుదలైన స్త్రీ2 సంచలన విజయం సాధించడంతోపాటు భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఆ సినిమాకు పోటీగా విడుదలైన వేద, డబుల్ ఇస్మార్ట్, ఖేల్ ఖేల్ మే లాంటి సినిమాలు స్త్రీ2కు దరిదాపుల్లో కూడా లేవు.

allu arjun Pushpa2 movie missed a good opportunity by not releasing on August 15th

మూడు రోజులకే దాదాపు రూ.200 కోట్లు
రాజ్ కుమార్ రావు లాంటి చిన్న హీరో, శ్రద్ధా కపూర్ లాంటి హీరోయిన్ నటించగా విడుదలైన ఈ చిత్రం మొదటిరోజే రూ.100 కోట్ల సినిమాకు వచ్చే స్థాయిలో కలెక్షన్లు రావడం విశేషం. మూడురోజుల్లోనే రూ.188 కోట్లు కొల్లగొట్టింది. ఒక కామెడీ హారర్ సినిమా, అందులోను చిన్న బడ్జెట్ లో తీసిన సినిమా స్టార్లు ఎవరూ లేకుండా ఈ స్థాయిలో కలెక్షన్లు రాబడుతోందంటూ దానికి కారణం ఆగస్టు 15తోపాటు వరుస సెలవులే. ముంబయిలో అర్థరాత్రి కూడా ప్రత్యేక షోలు వేస్తున్నారు.

ఈ సినిమాకు బదులుగా పుష్ప2 వచ్చివుంటే స్త్రీ2తోపాటు ఇతర సినిమాలన్నీ పక్కకు తప్పుకునేవి. తెలుగులో డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ కూడా వారం, రెండు వారాల తేడాతో విడుదలయ్యేవి. మొదటినుంచి అనుకుంటున్నట్లుగా రూ.వెయ్యి కోట్లు కాకపోయినా కనీసం ఆ దరిదాపుల్లోకైనా పుష్ప2 వెళ్లేది. సినిమా బాగుందనే టాక్ వస్తేనే. రికార్డులు బద్దలుకొట్టే మంచి అవకాశం పోయిందని బన్నీ అభిమానులు బాధపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+