అల్లు అర్జున్ "రాకా"లో షారుఖ్ ఖాన్..?

ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్" ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వచ్చిన ఈ మూవీ.. పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అందుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. ఒక్క బాలీవుడ్ లోనే ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత పార్ట్ 2.. విడుదలైన రోజు నుంచే పుష్ప రాజ్ బాక్సాఫీస్ వద్ద తన హవాని చూపించాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 1800 కోట్లు వసూలు చేయడంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.

ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టులపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకున్నాయి. అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న చిత్రం 'రాకా'. ఈ మూవీని సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దాదాపు రూ.800 కోట్ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ , రష్మిక మందాన కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

allu-arjun-raaka-movie-under-atlee-direction-creating-buzz-that-shahrukh-khan-playing-guest-role-in

కాగా ఇటీవల ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ ఫ్యాన్స్‌ కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమా టైటిల్ తో పాటు, అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి మూవీపై బజ్ ను ఒక్కసారిగా పెంచేసింది. ఈ చిత్రానికి రాకా అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అల్లు అర్జున్ లుక్ ను అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. గుండుతో, భారీ గోర్లు, బీస్ట్ స్టైల్ తో లుక్ ఉండడం అందరికీ షాక్ ఇచ్చింది. అంతే కాకుండా 'ఇది కేవలం ప్రారంభం మాత్రమే, మీ ఊహలకు మించి సినిమా ఉంటుంది' అని చిత్రబృందం ఇచ్చిన క్యాప్షన్ మరింత హైప్‌ ను పెంచేసింది.

అయితే రాకా కథ, అల్లు అర్జున్ పాత్రపై సోషల్ మీడియా వేదికగా అనేక ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన పాత్ర రెండు విభిన్న స్వభావాలతో ఉండబోతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. పగలు సాధారణ మనిషిలా ఉండే హీరో.. రాత్రి భయంకరమైన రాక్షసుడి లాగా మారిపోతాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం డ్యూయల్ రోల్ మాత్రమే కాకుండా.. ఒక సైకాలజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కథగా కూడా ఉండొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక పాత్ర పాజిటివ్ కాగా.. మరో పాత్ర నెగెటివ్ అని స్పష్టం అవుతోంది. అలానే కొందరు ట్రిపుల్ రోల్ కూడా ఉండొచ్చని ప్రచారం చేస్తున్నారు.

మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్‌ అగ్ర తార షారుక్‌ఖాన్‌ అతిథి పాత్రలో నటిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. దర్శకుడు అట్లీ - షారుక్‌ మధ్య మంచి సంబంధాలున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'జవాన్‌' ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఆ అనుబంధం దృష్ట్యా షారుక్‌ అతిథి పాత్ర ప్రచారానికి బలం చేకూరుతోంది. దీంతో ఈ విషయం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ వర్గాల్లో సైతం హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+