మెగాస్టార్ రికార్డ్ బ్రేక్.. ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్" నయా సెన్సేషన్ !

ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్" వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. "అలా వైకుంఠపురం" సినిమాతో తెలుగులో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టి .. "పుష్ప" సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. #AA22xA6 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మరో సరికొత్త రికార్డు సాధించారు.

వరుసగా ఏడోసారి..

70వ ఫిల్మ్‌ఫేర్‌ సౌత్ అవార్డ్స్ వేడుక (ఫిబ్రవరి 21, 2026) రాత్రి కేరళలోని కొచ్చిలో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీల నుంచి 2024 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు ఈ అవార్డులు అందజేశారు. అందులో భాగంగా అల్లు అర్జున్ ఉత్తమ నటుడు పురష్కారాన్ని అందుకున్నారు. 'పుష్ప 2: ది రూల్' సినిమాకు గాను ఆయనకు ఈ అవార్డు వరించింది. దీంతో 7 ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఉన్న ఏకైక టాలీవుడ్ హీరోగా బన్నీ నిలిచారు.

allu-arjun-receives-7th-filmfare-award-for-pushpa-movie-and-breaks-megastar-chiranjeevi-awards-recor

అంతకు ముందు పరుగు, వేదం, రేసు గుర్రం, రుద్రమదేవి (బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్), సరైనోడు, పుష్ప.. సినిమాలకు గాను ఆయన ఫిలిం ఫేర్స్ అందుకున్నారు. దీంతో బన్నీ మెగాస్టార్ చిరంజీవితో పాటు ఏడు ఫిలిం ఫేర్ అవార్డులు ఉన్న హీరోగా నిలిచారు. చిరంజీవి 7 అవార్డులతో పాటు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, స్పెషల్ లెజెండ్ అవార్డుతో కలిపి 9 ఫిలిం ఫేర్ అవార్డులు ఉన్న హీరోగా రికార్డు సాధించారు.

70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (తెలుగు) విజేతలు..

ఉత్తమ చిత్రం: పుష్ప 2: ది రూల్

ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2: ది రూల్)

ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)

ఉత్తమ నటి - నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)

ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 AD)

ఉత్తమ సహాయ నటి: అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)

ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్‌ (సత్యభామ)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జ (హను-మాన్)

బెస్ట్ డెబ్యూ ఫిమేల్ - నయన్ సారిక (గం గం గణేశ)

బెస్ట్ డెబ్యూ మేల్ - సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ - యాధు వంశీ (కమిటీ కుర్రోళ్లు)

బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2: ది రూల్)

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్): శ్రీకృష్ణ (కుర్చీ మడతపెట్టి- గుంటూరు కారం)

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్): శిల్పా రావు (చుట్టమల్లె - దేవర: పార్ట్ 1)

బెస్ట్ లిరిక్స్ - రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లె - దేవర: పార్ట్ 1)

బెస్ట్ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్‌ ( కుర్చీ మడతపెట్టి - గుంటూరు కారం)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ-మోనికా (పుష్ప 2: ది రూల్) & నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 AD)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+