అల్లు అర్జున్ భార్య జిమ్ వీడియో చూస్తే మెంటల్ ఎక్కాల్సిందే..!
హీరో అల్లు అర్జున్‌కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయారు. సినిమాలతో పాటు, ఫ్యామిలీకి కూడా ప్రాధాన్యతను ఇస్తుంటారు. అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్నేహారెడ్డికి హీరోయిన్లతో సమానంగా క్రేజ్ ఉందంటే అతిశేయోక్తి కాదు. గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుందామె. స్నేహారెడ్డికి ఇన్ స్టాగ్రామ్‌లో ఏకంగా 9.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సంబంధించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే స్నేహారెడ్డి తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తన భర్త అల్లు అర్జున్ సినిమా విశేషాలతో పాటు, తన పిల్లల విషయాలను సోషల్ మీడియా వేదికగా స్నేహారెడ్డి షేర్ చేస్తుంటుంది. ఇక అల్లు స్నేహా ఫ్యాషన్‌కు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. ఆమె లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారని ఆమె డ్రెస్సింగ్ స్టైల్ చూస్తేనే అర్ధం అవుతుంది.

స్నేహారెడ్డి అందానికి సైతం ప్రాముఖ్యతను ఇస్తుంటారు. బాడీ షేప్‌ను ఎప్పుడు నాజుగ్గా ఉంచుకోవడానికి ఆమె తీవ్రమైన కసరత్తులు చేస్తుంటారు. తాజాగా జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తోన్న వీడియో ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేశారామె. ఈ వీడియోలో స్నేహారెడ్డి బరువైన కసరత్తులు చేస్తూ కనిపించారు. అందంగా కనిపించడానికి ఆమె అధిక సమయం జిమ్‌లోనే గడిపేస్తోన్నట్టు ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది.
ఈ కారణంగానే ఇద్దరు పిల్లల తల్లైనప్పటికి ఆమె అందంగా కనిపిస్తున్నారు. ఆదివారం స్నేహారెడ్డి బర్త్ డే. భార్య పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు అల్లు అర్జున్. ఫ్యామిలీతో పాటు, అతికొద్దిమంది ఫ్రెండ్స్ మాత్రమే స్నేహారెడ్డి పుట్టిన రోజు వేడకకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను స్నేహారెడ్డి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో స్నేహారెడ్డి మరింత గ్లామర్‌గా కనిపించి అదరగొట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications