అల్లు అర్జున్- రాజమౌళి కాంబో ఫిక్స్..? భయపెడుతున్న బన్నీ పాత్ర..?
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమాకు ముందు తెలుగులో టాప్ డైరెక్టర్ గా ఎదిగిన జక్కన్న పేరు.. బాహుబలి తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో మారుమోగింది. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్ని మెప్పించారు రాజమౌళి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు తో వారణాసి చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 2027 వేసవి టార్గెట్ గా వారణాసి చిత్రం రిలీజ్ కానుంది.
మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 1, పుష్ప 2 చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పుష్ప-2 ది రూల్ గతేడాది డిసెంబర్ 5 విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రూ. 400 కోట్లకుపైగా బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 1800 కోట్ల వరకు కలెక్ట్ చేసి పాన్ ఇండియా రేంజ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతకుముందు ఉన్న బాహుబలి 2 రికార్డుల్ని చాలా చోట్ల ఈ మూవీ దాటేయడం విశేషం. అయితే ఇప్పుడు రాజమౌళి- అల్లు అర్జున్ కాంబోలో మూవీ వస్తున్నట్లు సమాచారం అందుతోంది.
అన్ని అనుకున్నట్టు జరిగితే వారణాసి సినిమా తర్వాత రాజమౌళి అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా.. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాక ఈ మూవీలో అల్లు అర్జున్ అడవి మనిషిగా కనిపించబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. 1980 నాటి కథ ఆధారంగా ఈ కథను విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే ప్రస్తుతం రాజమౌళి తన దృష్టి మొత్త వారణాసి చిత్రంపైనే పెట్టారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేశారు. సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఈ మూవీస్ తర్వాతనే రాజమౌళి- అల్లు అర్జున్ కాంబో స్టార్ట్ కానున్నట్లు సమాచారం.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications