కోల్డ్‌వార్... అల్లు అర్జున్ AAA మల్టీప్లెక్స్‌లో 'మట్కా' షోలు రద్దు!

కొన్నాళ్లుగా మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందనే విషయం తెలిసిందే. మెగా అనే ట్యాగ్ లేకుండా తనను తాను సొంతంగా నిరూపించుకోవాలనే పట్టుదలతో అల్లు అర్జున్ ఉన్నారు. అయితే ఎక్కడి నుంచి వచ్చామో, అందుకు ఎవరు సాయం చేశారో మరిచిపోతే ఎన్ని విజయాలు సాధించినప్పటికీ అవేవీ పరిగణనలోకి రావని వరుణ్ తేజీ రెండురోజుల క్రితమే కామెంట్స్ చేశారు. అవి అల్లు అర్జున్ గురించే అని సోషల్ మీడియాలో వార్తలు వైరలయ్యాయి. చివరకు వరుణ్ తేజ్ సినిమా మట్కా విడుదలైంది. దర్శకుడు కరుణకుమార్ తీవ్రమైన వైఫల్యంతో ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది.

గెటప్పులు మినహా సినిమాలో ఏమీ లేవు
వరుణ్ తేజ్ నటన పరంగా, వైవిధ్యంగా వేసిన గెటప్పులు మినహా ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీలేదని మెగా అభిమానులు దర్శకుడిపై మండిపడుతున్నారు. మొదటిరోజు రెండుకోట్ల రూపాయలు కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా రాగా, రెండోరోజు రాయడానికి కూడా కలెక్షన్లు ఏమీ రాలేదు. చాలా థియేటర్లలో, మల్టీప్లెక్స్ ల్లో ఈ సినిమా షోలు రద్దుచేస్తున్నారు. ప్రేక్షకులు లేకపోవడమే దీనికి కారణం. అలాగే అల్లు అర్జున్ కు చెందిన ఏఏఏ మల్టీప్లెక్స్ లో కూడా మట్కా షోలు రద్దు చేశారు. దీనిపై మెగా అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఆర్మీతో ఫేక్ ఖాతాలు తెరిపించి మట్కాపై తీవ్రమైన వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటున్నారు.

Allu Arjun s AAA multiplex has canceled varun tej matka movie shows

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బన్నీ అభిమానులు
మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా వరుణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు మండిపడుతున్నారు. సినిమాలో విషయం లేక ప్రేక్షకులు రాకపోతుండటంతో ఆడలేక మద్దెల దరువు అన్నట్లుగా తమపై పడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. చేసే సినిమా సరిగా చేయాలని, అది ఫ్లాపైతే తామేం చేస్తామని బన్నీ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. సినిమాపై మొదటినుంచి వ్యతిరేక ప్రచారాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లిందే అల్లు అర్జున్ ఆర్మీ, అభిమానులని, కావాలనే షోలు రద్దు చేశారని, గేమ్ ఛేంజర్ టీజర్ గురించి కూడా బన్నీ అభిమానులు ట్రోలింగ్ చేశారని, పుష్ప2 విడుదలవుతుందిగా.. అప్పుడు చూసుకుందామంటున్నారు మెగా అభిమానులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+