'పుష్ప'చూసి స్మగ్లర్లు అయితే 'OG'ని చూసి గ్యాంగ్ స్టార్లు కారా..? పవన్ కల్యాణ్‌కు అదరిపోయే కౌంటర్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కోసారి ఏం మాట్లాడుతుంటారో ఆయనకే తెలియదు అన్నట్లుగా విమర్శలు వినిపిస్తుంటాయి. ఓ సందర్భంలో ఆయన మాట్లాడే మాటలు మరో సందర్భంలో ఆయనకే కౌంటర్‌గా అనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తన సినిమా ' ఓజీ 'కి గట్టిగా తగులుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో కొంతకాలం క్రితం కర్ణాటకలో పర్యటించిన పవన్ కళ్యాణ్ కుంకీ ఏనుగుల అంశంపై ఆ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు.

ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ... అప్పట్లో సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడు. ఈ రోజుల్లో హీరో అడవుల్ని నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు అని అన్నారు. అయితే పవన్ కావాలని ఆ కామెంట్స్ చేశారా లేక అనుకోకుండా అన్నారో తెలియదు కానీ సరిగ్గా ఆ సమయంలోనే 'పుష్ప 2' ఫీవర్ నడుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ తమ హీరోని టార్గెట్ చేసే ఆ వ్యాఖ్యలు చేశారని అల్లు అర్జున్ అభిమానులు మండిపడ్డారు. పైగా అప్పట్లో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య సంబంధాలు సరిగ్గా లేవనే ప్రచారం ఉండేది. దీంతో పవన్ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.

Allu Arjun s fans are angry over Pawan Kalyan s OG movie

ఇటీవల అల్లు అర్జున్ నాయనమ్మ అల్లు కనకరత్నమ్మ మరణించడంతో పవన్ కళ్యాణ్ వారింటికి వెళ్లి అల్లు అరవింద్, అల్లు అర్జున్‌ని పరామర్శించారు. ఈ సందర్బంగా బన్నీ, పవన్ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని హత్తుకోవడంతో ఇద్దరి మధ్య పొరపొచ్చాలు సమసిపోయి కలిసిపోయారని అంతా భావించారు. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం పవన్ కామెంట్స్‌ని మరిచిపోలేదు. సరైన సమయం కోసం వేచిచూస్తూ ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' రిలీజ్ అవుతున్న సందర్బంలో తమ పగని తీర్చుకుంటున్నారు. 'ఓజీ'లో పవన్ ఓజాస్ గంభీర అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారు.

దీంతో అప్పట్లో పవన్ చేసిన వ్యాఖ్యలని ట్యాగ్ చేస్తూ బన్నీ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు . 'పుష్ప' స్మగ్లింగ్ సినిమా అయితే 'ఓజీ' భక్తిరస చిత్రమా అని ప్రశ్నిస్తున్నారు. పవన్ గతంలో చెప్పిన మాటలను గుర్తుచేస్తూ స్క్రీన్‌షాట్లు, మీమ్స్‌తో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.ఓవైపు పవన్ అభిమానులు 'ఓజీ' సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తుండగా మరోవైపు బన్నీ ఫ్యాన్స్ చేస్తోన్న ట్రోలింగ్ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. అయితే పవన్ అభిమానులు కూడా బన్నీ ఫ్యాన్స్‌కి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. పుష్ప, ఓజీ రెండూ కమర్షియల్ సినిమాలేనని, ఒక హీరో సినిమాని మరో హీరో ఫ్యాన్స్ టార్గెట్ చేయడం తప్పని పవన్ ఫ్యాన్స్ అంటుంటే.. మీ హీరో మాత్రం మా హీరో సినిమాపై కామెంట్స్ చేయొచ్చా అని నిలదీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+