పుష్ప-2 ఫ్లాప్ చేయడానికి మెగా కుట్ర.. సంచలన విషయాలు వెలుగులోకి
మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలవడమే దీనికి కారణం.మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. దీని తర్వాత అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, దానికి బన్ని అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వడం చక చక జరిగిపోయాయి. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేశారు. ఇక ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం..అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు.

కిర్రాక్ ఆర్పీ వంటి ఆర్టిస్టులు నేరుగానే అల్లు అర్జున్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు సైతం గట్టిగానే కౌంటరిస్తున్నారు.ఇదిలా ఉంటే అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ కల్యాణ్‌తో వైరం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాపై పడుందని మొదటి నుంచి అంచనా వేస్తున్నారు.తాజాగా మెగా అభిమానులు పుష్ప-2పై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయలంటూ మాట్లాడుకున్న ఆడియో కాల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పుష్ప-2 ఫ్లాప్ చేయడానికి మెగా ఫ్యాన్స్ కుట్ర #AlluArjun #Pushpa2TheRule #Chiranjeevi #PawanKalyan #RamCharan #AlluVsMega #Teluguoneindia #OneindiaTelugu pic.twitter.com/7n0wM3jH7I
— oneindiatelugu (@oneindiatelugu) November 28, 2024
వీపీఎన్ ద్వారా సినిమాను లైవ్ స్ట్రీమింగ్ చేస్తానని, అందులో సినిమా బాలేదని చెబుతానని ఓ అభిమాని చెప్పడం జరిగింది. వీపీఎన్ ఇన్‌స్టాల్ చేసుకుంటే ఐపీ అడ్రస్ ఎవరికి దొరకమని చెప్పుకోవడం ఈ ఆడియో కాల్ రికార్డింగ్‌లో వినిపించింది. దీనిపై అల్లు అభిమానులు సైతం గట్టిగానే కౌంటరిస్తున్నారు. మీకు అంత దమ్ము ఉంటే ఆచార్య ఎందుకు హిట్ చేసుకోలేకపోయారంటూ ఎద్దెవా చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నిన పుష్ప-2 సినిమాను అడ్డుకోవడం ఎవరితరం కాదంటూ మెగా అభిమానులకు అల్లు అర్జున్ అభిమానులు కౌంటరిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో కాల్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications