పుష్ప2: తెలుగులో అల్లు అర్జున్‌కు ఇష్టమైన స్టార్ హీరో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప2. ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 5వ తేదీన 11,500 స్క్రీన్లలో విడుదల కాబోతోంది. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకున్న ఈ సినిమా విడుదల వాయిదాలమీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఐదోతేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆహా ఓటీటీలో వస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా తెలుగులో నీకు ఇష్టమైన హీరో ఎవరు? అని అడ్డగా దానికి బన్నీ చాలా తెలివిగా సమాధానమిచ్చాడు.
అందరి హీరోల పేరు చెప్పాడు
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ నటన చాలా బాగా నచ్చిందని, తర్వాత జాతి రత్నాలు సినిమాలో నటించిన నవీన్ పోలిశెట్టి నటనను చూస్తూ, ఆ సినిమాను చూస్తున్నంతసేపు కిందపడి నవ్వుకుంటూనే ఉన్నానన్నారు. డీజే టిల్లు సినిమా చూసిన తర్వాత తనకు సిద్ధు జొన్నలగడ్డ బాగా నచ్చాడని, తర్వాత విశ్వక్ సేన్ బాగా నచ్చుతున్నాడంటూ సమాధానం ఇచ్చాడు. అలాగే అడవి శేష్ నటనను తాను బాగా మెచ్చుకుంటానన్నారు. ఇలా ఈ తరంలోని హీరోలందరి పేర్లు చెబుతూ ఎవరినీ హర్ట్ చేయకుండా బన్నీ తెలివిగా సమాధానం చెప్పాడు. దీంతో బాలయ్య ఇలాంటివన్నీ చెప్పొద్దు.. ఒక్క పేరు చెప్పాలని అడిగారు. దీంతో బన్నీ తనను బాగా ప్రభావితం చేసింది మాత్రం సిద్ధ జొన్నలగడ్డ అని చెప్పాడు.

సిద్ధు తన అభిమాన హీరో
డీజే టిల్లు సినిమాతో చాలా ప్రభావితమయ్యానని బన్నీ చెప్పాడు. దీంతో సిద్ధు జొన్నలగడ్డ అభిమానులు ఖుషీ అవుతున్నారు. బన్నీ ఫేవరెట్ హీరో సిద్ధు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. పుష్ప2 ట్రైలర్ ను ఈనెల 17వ తేదీన పాట్నాలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్ప1 తెలుగులోకన్నా హిందీలోనే ఎక్కువ విజయాన్ని సాధించింది. ఈ సినిమా అక్కడ దాదాపు రూ.130 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలకన్నా హిందీ బెల్టు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం బడ్జెట్ దాదాపు రూ.400 కోట్లు.












Click it and Unblock the Notifications