ఇన్ని ఫొటోల్లో ఏ ఫొటో ఇవ్వని ఆనందం .. ఈ ఒక్క ఫొటో ఇచ్చింది..!

దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ మరణంతో అల్లు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషాద సమయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అల్లు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

విశాఖపట్నంలో జనసేన బహిరంగ సభ ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ నేరుగా హైదరాబాద్‌లోని అల్లు నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లను కలిసి ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. కనకరత్నమ్మతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. అల్లు కనకరత్నమ్మ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు.

Allu Kanakaratnamma s Demise A Catalyst for Mega and Allu Family Reunion

కనకరత్నమ్మ మరణించారని తెలియడంతో మెగా హీరోలందరూ హూటిహూటిన అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్,సాయి ధరమ్ తేజ్,వరుణ్ తేజ్,అందరూ కూడా అల్లు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అయితే గతంలో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి.

పైకి అంతా బాగానే కనిపించినప్పటికీ లోలోపల మాత్రం అంతర్యుద్ధం సాగుతోంది. గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి నంద్యాల వెళ్లి మరీ తన మద్దతు ప్రకటించారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు.

అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్‌లో కూడా మెగా ఫ్యామిలీ సైలెంట్‌గానే ఉంది. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎవరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించలేదు. తాజాగా అల్లు కనకరత్నమ్మ మరణంతో మెగా , అల్లు ఫ్యామిలీల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయినట్టే అని అభిమానులు భావిస్తున్నారు.ఈ సంఘటన అల్లు, మెగా కుటుంబాల మధ్య ఉన్న బలమైన బంధాన్ని మరోసారి చాటి చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+