వైభవంగా అల్లు శిరీష్ - నైనిక నిశ్చితార్థం.. పవన్ రాకపోవడానికి కారణం అదే !

అల్లు వారింట పెళ్లి భాజాలు మోగడానికి సమయం దగ్గర పడుతోంది. యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల తన పెళ్లికి సంబంధించిన శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. అక్టోబర్ 31వ తేదీ తన నిశ్చితార్థం.. నైనిక అనే అమ్మాయితో జరగబోతుందని అధికారికంగా వెల్లడించారు. అయితే తనకు కాబోయే భార్య ఫోటోలను మాత్రం ఈయన ఎక్కడ షేర్ చేయలేదు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అయ్యి సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేశారు.

అంగరంగ వైభవంగా..

ఈ క్రమంలోనే ముందుగా ప్రకటించినట్టు అల్లు శిరీష్, నయనిక నిశ్చితార్థం వేడుక హైదరాబాద్‌ లోని వధువు నివాసంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఇరువురూ ఉంగరాలు మార్చుకున్నారు. తెలుపు రంగు కుర్తా పైజామాలో శిరీష్.. ఎరుపు రంగు శారీలో నైనిక మెరిశారు. ప్రస్తుతం ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

allu-sireesh-and-nainika-reddy-engagement-photos-goes-viral

శిరీష్ - నైనికా రెడ్డి రెండేళ్లుగా ప్రేమలో ఉండగా.. చివరకు పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. అంతేకాకుండా నైనిక .. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా మంచి స్నేహితులని తెలుస్తోంది. కాగా ఈ వేడుకకు అల్లు ఫ్యామిలితో పాటు చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ సహా పలువురు కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఏపీలో వరద బాధితులను పరామర్శిస్తూ బిజీగా ఉన్న కారణంతో రాలేకపోయారని అంటున్నారు.

అల్లు శిరీష్ కెరీర్..

'గౌరవం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో.. ఇప్పటి వరకు గ్రాండ్ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయారు. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోయినా.. కొత్త జంట, ఏబీసీడీ, శ్రీరస్తు శుభమస్తు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిగా 'టెడ్డీ' చిత్రంతో వచ్చిన శిరీష్ మరోసారి ప్రేక్షకులను నిరాశపరిచాడు.

ఇక తెలుగు చిత్రపరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అల్లు ఫ్యామిలీ. అల్లు రామలింగయ్య వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన అల్లు అరవింద్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు. ఆయన ముగ్గురు కుమారుల్లో పెద్ద కుమారుడైన బాబీ సినీ రంగంలో యాక్టివ్‌గా లేరు. అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతుండగా.. అల్లు శిరీష్ కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+