అల్లు వారింట మోగనున్నపెళ్లి భాజాలు.. ఆమె తోనే అల్లు శిరీష్ మ్యారేజ్ ఫిక్స్ !!
తెలుగు చిత్రపరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అల్లు ఫ్యామిలీ. అల్లు రామలింగయ్య వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన అల్లు అరవింద్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్‌పై అనేక అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ, ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతలలో ఒకరిగా రాణిస్తున్నారు. ఆయన ముగ్గురు కుమారుల్లో పెద్ద కుమారుడైన బాబీ సినీ రంగంలో యాక్టివ్‌గా లేరు. అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతుండగా.. అల్లు శిరీష్ కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నారు.
అల్లు శిరీష్ కెరీర్..
'గౌరవం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో.. ఇప్పటి వరకు గ్రాండ్ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయారు. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోయినా.. కొత్త జంట, ఏబీసీడీ, శ్రీరస్తు శుభమస్తు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిగా 'టెడ్డీ' చిత్రంతో వచ్చిన శిరీష్ మరోసారి ప్రేక్షకులను నిరాశపరిచాడు. యాక్టింగ్ పరంగా మెరుగైనా కానీ స్టోరీ సెలక్షన్ లో మాత్రం కొంచెం కేర్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

అల్లు కనకరత్నమ్మ మరణం..
అల్లు కుటుంబంలో ఇటీవలే తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ కొద్దిరోజుల క్రితమే మృతి చెందారు. కాగా ఇప్పుడు అల్లు వారింట పెళ్లి భాజాలు మోగనున్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అల్లు శిరీష్ త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడని టాక్ వినిపిస్తోంది.
అల్లు శిరీష్ పెళ్లి ఫిక్స్..
హైదరాబాద్‌కి చెందిన ఓ బడా వ్యాపారవేత్త కుమార్తెతో శిరీష్ కి పెళ్లి నిశ్చయం చేసినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల మధ్య ఇప్పటికే మాటలు పూర్తయి పెళ్లికి నిర్ణయం కూడా తీసుకున్నారని చెబుతున్నారు. కానీ అనూహ్యంగా అల్లు కనకరత్నమ్మ చనిపోవడంతో.. శుభకార్యం వాయిదా పడినట్లు భావిస్తున్నారు. కాగా త్వరలోనే ఈ జంటకి ఎంగేజ్‌మెంట్ నిర్వహించి పెళ్లి కూడా త్వరగా చేయాలని ఇరు కుటుంబాలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో అల్లు ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగనున్నాయని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
-
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
'బెడ్ రూమ్ లో నా భర్త చేసేది ఇదీ'.. రాజ్ నిడిమోరుపై సమంత వైరల్ పోస్ట్.. -
'జబర్దస్త్' యాంకర్ ఛాన్స్ వదులుకున్న నటి ఎవరో తెలుసా? అనసూయ స్థానంలో.. -
చిరంజీవి కూతురుగా బ్లాక్ బస్టర్ మూవీ హీరోయిన్.. ఎవరంటే..? -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..!












Click it and Unblock the Notifications