ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న మెగా హీరో..?
మెగా ఫ్యామిలీకి ధీటుగా అల్లు ఫ్యామిలీ నుంచి కూడా హీరోలు వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన అర్జున్ స్టార్ హీరోగా ఎదిగి, తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ సైతం హీరోగా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నాడు. అయితే అల్లు అర్జున్‌కు వచ్చినంత క్రేజ్ శిరీష్‌కు రాలేదనే చెప్పాలి. 'గౌరవం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్, కొత్తజంట, ఏబీసీడీ, క్షణం క్షణం , శ్రీరస్తు శుభమస్తు, ఊర్వశివో రాక్షసివో వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కిచుకున్నారు.
అయితే ఈ సినిమాలేవి కూడా అల్లు శిరీష్‌కు సరైన బ్రేక్ ఇవ్వలేకపోయాయి. అల్లు శిరీష్ తాజాగా నటించిన బడ్డీ సినిమా కూడా అభిమానులను నిరాశ పరిచింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అల్లు శిరీష్ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను సైతం అభిమానులతో షేర్ చేసుకుంటుంటాడు. ఇదే సమయంలో ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వారికి సాయం కూడా చేస్తారు. ఆ మధ్య ఓపేద విద్యార్ధికి ల్యాప్‌టాప్‌ని సాయంగా అందించారు. ఇదిలా ఉంటే తాజాగా అల్లు శిరీష్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనేది ఈ వార్త సారాంశం.

అల్లు శిరీష్ తన బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేసి వివాహ బంధంతో ఓ ఇంటివాడు అవుతున్నాడని పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. అల్లు శిరీష్ ప్రేమించిన అమ్మాయినే పెళ్లి ళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ముంబైలో యాక్టింగ్ నేర్చుకునే సమయంలో అల్లు శిరీష్ ఓ అమ్మాయితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించి తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ప్రజెంట్ అల్లు శిరీష్ పెళ్లి వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తలపై అల్లు శిరీష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.












Click it and Unblock the Notifications