బోయపాటి సినిమాకు కండీషన్ పెట్టిన అల్లుఅర్జున్..
పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ నేషనల్ స్టార్‌గా మారిపోయాడు. ఆ సినిమా సాధించిన విజయం గురించి చెప్పక్కర్లేదు. అయితే, తాజాగా బన్నీ, బోయపాటి కాంబినేషన్లో సినిమా రాబోతుందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్. అయితే, ఈ సినిమాకోసం బోయపాటి శ్రీనుకు బన్నీ కొన్ని కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో వీళ్లిద్దరి కాంబీనేషన్‌లో వచ్చిన సరైనోడు చిత్రం బాక్సాఫీస్ వద్ద బారీ వసూళ్లనే రాబట్టింది. అప్పటినుంచి మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అయితే, పుష్ప సినిమాతో బన్నీ ఇమేజ్ అమాతం పెరిగిపోయింది. దాంతో ఇప్పుడూ ఏ సినిమా విషయంలోనైనా అల్లుఅర్జున్ ఆచితూచి అడుగులువేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బోయపాటి సినిమాకు కండీషన్స్ పెట్టాల్సి వస్తోందని మీడియా వర్గాలు అంటున్నాయి. ఈ మధ్యకాలంలో బోయపాటి శ్రీను, రామ్ కాంబీనేషన్‌లో వచ్చిన స్కంద సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో బోయపాటి ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయ్యింది. ఈ సినిమాపై సోషల్‌మీడియాలో చాలా మీమ్స్ కూడా వచ్చాయి. దీంతో, బోయపాటి సినిమా అనగానే చాలామంది ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అదే పద్ధతిని బన్నీ కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

స్క్రిప్ట్ నిజంగా నచ్చితేనే సినిమాకు ఓకే..
పుష్ప 2 సినిమా అనంతరం అల్లుఅర్జున్‌కు ఆరు నుంచి ఎమినిది నెలల గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్‌లోనే బన్నీ ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. అయితే అల్లుఅర్జున్ బోయపాటికి అవకాశం ఇస్తాడా లేదా అనేదే అందరి ప్రశ్న. ఇదిలా ఉండగా స్కంద సినిమా ప్రచారంలోనే అల్లుఅర్జున్‌తో సినిమాపై స్పందించాడు బోయపాటి. ఇప్పుడు అల్లుఅర్జున్‌తో సినిమా చేసేందుకు బోయపాటి వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బోయపాటి చెప్పిన స్క్రిప్ట్ నిజంగా నచ్చితేనే ఆ సినిమాకు ఒప్పుకుంటానని అల్లు అర్జున్ బోయపాటికి చెప్పినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ వీలైనంత సాలిడ్‌గా, లాజికల్‌గా ఉండాలని క్లియర్ గా చెప్పారని టీ టౌన్ వర్గాల్లో టాక్. దాంతో బోయపాటి తన దగ్గర ఉన్న పాయింట్‌తో అల్లు అర్జున్‌కు నచ్చేలా కథను సిద్ధం చేసే ప్రయత్నంలో ఉన్నారట..












Click it and Unblock the Notifications