పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న చిత్రం 'రాకా' ఈ మూవీని సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. రూ. 800 కోట్లతో దేశంలోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న చిత్రాల్లో రాకా ఒకటి. అల్లు అర్జున్, అట్లీ క్రేజీ కాంబో కావడంతో సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అటు ఫ్యాన్స్ కూడా ఈ మూవీపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. దాంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఎదురు చూస్తున్నారు.
ఇక ఇటీవల ఏప్రిల్ 8 న బన్నీ బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ కీలక అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను సర్‌ప్రైజ్ చేసింది. ఏకంగా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి మూవీపై బజ్ ను ఒక్కసారిగా పెంచేసింది. అంతేకాక మూవీ టైటిల్ ను కూడా ప్రకటించింది. ఈ చిత్రానికి రాకా అనే టైటిల్ ఫిక్స్ చేసింది. ఇక ఈ మూవీ నుంచి అల్లు అర్జున్ లుక్ ను చూస్తే మైండ్ బ్లాక్ అంతే.. గుండు లుక్ తో, భారీ గోర్లు, బీస్ట్ స్టైల్ తో లుక్ ఉంది. అంతేకాక 'ఇది కేవలం ప్రారంభం మాత్రమే, మీ ఊహలకు మించి సినిమా ఉంటుంది' అని చిత్రబృందం ఇచ్చిన క్యాప్షన్ మరింత హైప్ ను పెంచేసింది.
ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ క్యారెక్టర్ కు సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రాకా మూవీలో అల్లు అర్జున్ క్యారెక్టర్ మెంటల్ ఎక్కిస్తుందని టాక్. ఈ సినిమాలో హీరో పగలు పూట మనిషి లాగా ఉంటాడట.. ఇక రాత్రి సమయంలో మాత్రం రాక్షసుడిగా మారిపోతాడట..వింటానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఈ మూవీలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఇదేనని టాక్ వినిపిస్తోంది. అలాగే రాకా చిత్రం లో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఒక పాత్ర పాజిటివ్ కాగా.. మరో పాత్ర నెగెటివ్ అని స్పష్టం అవుతోంది.

రాకా మూవీని డైరెక్టర్ అట్లీ ఒక మాస్టర్ పీస్ మాదిరి తయారు చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ మూవీ కచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ ను బద్దలు కొడుతుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది. ఇకపోతే రాకా చిత్రంలో దీపికా పదుకొనే , మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ , రష్మిక మందాన కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications